Advertisement
Google Ads BL

సిక్స్ ప్యాక్ లుక్ తో మెగా హీరో


యంగ్ హీరో అల్లు శిరీష్ తన ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టి జిమ్ లో రెగ్యులర్ గా కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కండలు తిరిగిన దేహాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియా మధ్యమాలలో పోస్ట్ చేసి సిక్స్ ప్యాక్ బాడీతో ఔరా అనిపిస్తున్నాడు. ఈయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దీని కోసం వర్క్ఔట్స్ చేయడమే కాకుండా పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు అల్లు శిరీష్. గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు శిరీష్. శ్రీరస్తు శుభమస్తు ,ఒక్క క్షణం వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. కమర్షియల్ సినిమాల కంటే కూడా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల వైపు పరుగులు తీస్తున్నాడు శిరీష్. 

Advertisement
CJ Advs

ఎబిసిడి హిందీ డబ్బింగ్ సినిమాతో ఉత్తరాదిన కూడా క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల విలాయటి శరాబ్ అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ తో 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సత్తా చాటాడు. ఎబిసిడి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శిరీష్.. ఇప్పుడు కొత్త సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోంది. మే 30న అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.

Allu sirish posts his shirtless gym selfies :

Allu sirish posts his shirtless gym selfies and proves he is Tollywood latest hunk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs