Advertisement
Google Ads BL

రోజా రీ ఎంట్రీ ఇచ్చేసింది


కొన్నాళ్లుగా రోజా ఆరోగ్య సమస్యలతో ఓ మేజర్ ఆపరేషన్ తో చెన్నై లోని స్వగృహంలో రెస్ట్ తీసుకుని ఈ మధ్యనే తన నియోజకవర్గం నగరికి వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్లుగానే రోజా ఇంటి నుండే తన నియోజక వర్గం పనులని చక్కబెడుతుంది. అయితే చాలా రోజులుగా రోజా జబర్దస్త్ కి దూరమైంది. కొన్నాళ్లుగా రోజా ప్లేస్ లోకి సీనియర్ హీరోయిన్ ఇంద్రజ రావడం చూస్తూనే ఉన్నాం. ఇంద్రజ, మనో జెడ్జెస్ గా జబర్దస్త్ - ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ ఈటీవీలో ప్రసారం అవుతున్నాయి. అయితే మొన్నామధ్యన రోజా మళ్ళీ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఆమె ఆరోగ్యం చక్కబడడంతో రోజా మళ్ళి జబర్దస్త్ కి రాబోతుంది అన్నారు.

Advertisement
CJ Advs

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో రోజా బయటికి రాదు.. ఎలాగూ కాస్త ఆరోగ్యం కుదుటపడాలి, అందులోనూ ఇంద్రజ కూడా మొనన్ ఎపిసోడ్ లో ఎమోషనల్ గ తనకి జబర్దస్త్ తో బాగా గుర్తింపు వచ్చింది అనేసరికి.. ఇక రోజా రాదనుకుంటున్నారు. అలాగే అసలే కరోనా టైం అనుకుంటే.. రోజా మాత్రం జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చేసింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్స్ లో మనో తో పాటుగా రోజా కూడా జేడ్జ్ ప్లేస్ లో జాయిన్ అయ్యింది. మళ్ళీ రోజా తన స్థానాన్ని తాను తీసేసుకుంది. రోజా ఎప్పుడో చెప్పింది.. పాలిటిక్స్ - జబర్దస్త్ తనకి రెండు కళ్ళు అని. జబర్దస్త్ షో ని ఎట్టి పరిస్తితుల్లో వదులుకోను అని కూడా చెప్పింది. పొలిటికల్ గా ఎంత బిజీ గా వున్నా జబర్దస్త్ షో తనకి రిలీఫ్ ఇస్తుంది అని, అలాగే మనీ కోసం కూడా తాను జబర్దస్త్ షో చేస్తున్నట్లుగా చెప్పింది రోజా. ఇక ఆరోగ్యం కోసం కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన రోజా మళ్లీ జబర్దస్త్ కి వచ్చేసింది.

Roja Re entry to Jabardasth:

Roja is back to Jabardasth and Extra Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs