Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ నుండి మహేష్ కు..


గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ బర్త్ డే కోసం #JaiNTR హాష్ టాగ్ తో చెలరేగిపోయిన ఎన్టీఆర్ ఫాన్స్.. ఈ రోజు అర్ధరాత్రి నుండి ఎన్టీఆర్ కొత్త సినిమాల అప్ డేట్స్ తో ట్రెండ్ చేసారు. ఎన్టీఆర్ కు సంబందించిన నాలుగు సినిమాల అప్ డేట్స్ తో ఫాన్స్ ట్విట్టర్ లో చెలరేగిపోయారు. తారక్ అన్నా నువ్వు కేక అన్నా అంటూ ఎన్టీఆర్ సినిమాల అప్ డేట్స్ ని ట్రెండ్ చేస్తూ ఆయనకి విషెస్ చెప్పారు. ఇక ఎన్టీఆర్ కొమరం భీం పోస్టర్, NTR30 పోస్టర్, NTR31 ఎనౌన్సమెంట్, బుచ్చి బాబు - ఎన్టీఆర్ కాంబో ఇలా పోస్టర్స్, అప్ డేట్స్ అబ్బో ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందానికి అవధులే లేవు. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ ఏడాది ఇలా ముగిసింది. ఎన్టీఆర్ ది అలా సోషల్ మీడియాలో హడావిడి తగ్గిందో.. లేదో.. మహేష్ ఫాన్స్ స్టార్ట్ చేసేసారు. 

Advertisement
CJ Advs

అదేమిటంటే.. మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టిన రోజు మే 31. మే 31 న కృష్ణ బర్త్ డే రోజున మహేష్ కొత్త సినిమాల ప్రకటనలు లేదంటే పూజా కార్యక్రమాలు, ఆయన నటిస్తున్న సినిమాల లుక్స్ ని వదులుతుంటాడు. మహేష్ కి అది బాగా సెంటిమెంట్. గత ఏడాది కరోనా లాక్ డౌన్ లోనూ మహేష్ కృష్ణ గారి పుట్టిన రోజునాడు హడావిడి లేకుండా పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేసాడు. మరి ఈ ఏడాది కృష్ణ గారి పుట్టిన రోజుకి మహేష్ - త్రివిక్రమ్ SSMB28 మూవీ పూజా కార్యక్రమాలు ఉంటాయనే టాక్ తో పాటుగా సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ లుక్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అందుకే మహేష్ ఫాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో #SSMBRampageOnMAY31st అనే హాష్ టాగ్ తో ట్రేండింగ్ చేస్తున్నారు. 

మరి అలా ఎన్టీఆర్ బర్త్ డే హడావిడి ముగిసేలోపు మహేష్ ఫాన్స్ మొదలు పెట్టేసారు. ఇప్పుడు ఎన్టీఆర్ నుండి మహేష్ కు సోషల్ మీడియా ఫోకస్ చేసింది.

SSMBRampageOnMAY31st trending on twitter :

Fans focus diverts from NTR to Mahesh 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs