Advertisement
Google Ads BL

బిగ్ బాస్ సెట్ కి సీల్ వేసిన పోలీస్ లు


తెలుగు, తమిళ, కన్నడ, హిందీ బిగ్ బాస్ షో లు ఇప్పటికే  పూర్తయ్యి తర్వాత సీజన్స్ కోసం ఏర్పాట్లు చేసుకుందామనుకున్నా.. ప్రస్తుతం సెకండ్ వేవ్ కారణంగా బిగ్ బాస్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టిన కారణముగా సినిమా, సీరియల్ షూటింగ్స్ తో పాటుగా స్పెషల్ షోస్, బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో షూటింగ్స్ ని ఆపేసారు. కానీ లేట్ గా మొదలైన మలయాళ బిగ్ బాస్ షో మాత్రం ఆగలేదు. కేరళలో లాక్ డౌన్ పెట్టి.. దానిని పొడిగిస్తూ పోవడంతో.. సినిమా, సీరియల్స్ షూటింగ్స్ అన్నీ ఎక్కడిక్కడ నిలిపేసినా బిగ్ బాస్ షూటింగ్ మాత్రం చేస్తున్నారు.

Advertisement
CJ Advs

మోహన్ లాల్ వ్యాఖ్యాతగా సీజన్ 3 మలయాళంలో కొనసాగిస్తున్నారు. కేరళలో లాక్ డౌన్ పెట్టడంతో కంటెస్టెంట్స్ తో పాటుగా టెక్నీకల్ టీం మొత్తం చెన్నై లో వేసిన ప్రత్యేక సెట్ లో మలయాళ బిగ్ బాస్ ని రన్ చేస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం. అయితే సెట్ లో పలువురు టెక్నీకల్ సిబ్బందికి కరోనా సోకినా, సీక్రెట్ గా యధావిధిగా షూటింగ్ చెయ్యడంపై పోలీస్ లకి ఫిర్యాదు అందగా.. నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ చేపట్టిన బిగ్ బాస్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడమే కాదు.. ఈ రియాలిటీ షో షూటింగ్‌ను నిలిపివేశారు. కంటెస్టంట్స్‌తో పాటు కెమెరామెన్స్, టెక్నీషియన్స్, ఇతర సిబ్బందిని సెట్ నుంచి బయటకు పంపేసి బిగ్ బాస్ సెట్ ని సీల్ చేసారు పోలీస్ లు. 

95 రోజులపాటు సాగే ఈ మలయాళ బిగ్ బాస్ షో ని ఈ మధ్యనే రెండు వారాలు పెంచారు. ప్రస్తుతం బిగ్ బాస్ పై అంత జరుగుతున్నా కూడా బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం జులై 4 న యధావిధిగా గ్రాండ్ ఫినాలే జరుగతుంది అని ప్రకటించడం విశేషం.

Bigg Boss set sealed for violating ban:

Bigg Boss House sealed by Tamil Nadu Police
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs