Advertisement
Google Ads BL

చై - సామ్ ఫన్నీ ట్వీట్స్


అక్కినేని సమంత విలన్ గా, టెర్రరిస్ట్ గా కనిపించబోతున్న ద ఫామిలీ మాన్ వెబ్ సీరీస్ ట్రైలర్ ని ఈ రోజు ఉదయమే రిలీజ్ చేసింది ఫ్యామిలీ మ్యాన్ టీం. ఎప్పటినుండో ఫామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న సౌత్ ఇండియా ప్రేక్షకులు ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ చూడగానే ఆశ్చర్యపోతున్నారు. కారణం గ్లామర్ క్వీన్ సమంత అక్కినేని డీ గ్లామర్ గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న టెర్రరిస్ట్ కేరెక్టర్ లో అందరిని చంపేస్తా అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్న రాజి పాత్రని చూసి.. గ్లామర్ గర్ల్ సమంత లో ఇలాటి షేడ్స్ కూడా ఉన్నాయా అని షాకవుతున్నారు. మనోజ్ బాజ్పాయి తో సమానమైన కేరెక్టర్ చేస్తున్న సమంత పైన్ సౌత్ ఫోకస్ ఉంది.

Advertisement
CJ Advs

ఫామిలీ మ్యాన్ ట్రైలర్ చూసిన వారు డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే, హీరో మనోజ్ భాజపేయీ పెరఫార్మెన్స్ ని, అలాగే టెర్రరిస్ట్ లుక్ లో అదరగొట్టిన సమంత ని పర్సనల్ గా సోషల్ మీడియా ద్వారా అభినందిస్తున్నారు. సమంత సూపర్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 

సమంత భర్త, హీరో నాగ చైతన్య అయితే ఫామిలీ మ్యాన్ ట్రైలర్ చూసాక.. ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ అదిరిపోయింది అంటూ 10/10 రేటింగ్ ఇస్తూ ట్వీట్ చేసాడు. సమంత పెరఫార్మెన్స్ అదిరింది అంటూ ట్వీట్ చేసిన చైతూ ని సమంత రీ ట్వీట్ చేస్తూ.. నా పెరఫార్మెన్స్ కి 10/10 ఇచ్చావా.. లేదంటే ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ కి 10/10 ఇచ్చావా అంటూ ఆటపట్టించింది. ప్రస్తుతం సమంతని అప్రిషెట్ చేస్తూ టాలీవుడ్ నుండి తమిళ, హిందీ భాషల ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్స్ వర్షం కురిపిస్తున్నారు.

Chay Reaction On Raji:

Amazon Prime show The Family Man season 2 trailer out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs