Advertisement
Google Ads BL

ఆ మూడే నా చేతిలో ఉన్నాయి


ఉప్పెన సినిమాతో సముద్రమంత క్రేజ్ ని సంపాదించుకుంది కృతి శెట్టి. ఆ సినిమాలో బేబమ్మగా కృతి శెట్టి లుక్స్, పెరఫార్మెన్స్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయ్యింది. సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో వైష్ణవ తేజ్ - కృతి శెట్టిలకు అంతే పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత కృతి శెట్టి స్టార్ ఛాన్సెస్ కొట్టేస్తుంది.. ఆల్రెడీ బోలెడన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి.. ఉప్పెన రిలీజ్ కి ముందే నాని శ్యామ్ సింగ రాయ్ లో ఛాన్స్ కొట్టేసింది కృతి షెట్టి. ఇక ఉప్పెన రిలీజ్ తర్వాత రామ్ - లింగుస్వామి బైలింగువల్ మూవీలో నటిస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా కృతి శెట్టి బెల్లంకొండ గణేష్ డెబ్యూ మూవీలో నటించబోతుంది.. ఇంకా తమిళంలో కృతి శెట్టి కి ఆఫర్ వచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే తనకి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయనే రూమర్స్ కి కృతి శెట్టి సోషల్ మీడియా వేదికగా చెక్ పెట్టింది. ప్రస్తుతం తన చేతిలో ఉన్నవి మూడు ప్రాజెక్ట్స్ మాత్రమేనని.. నాని హీరోగా శ్యామ్ సింగ రాయ్ తో పాటు సుధీర్ బాబు మూవీ, రామ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నానని స్పష్టం చేసింది.

కేవలం తన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయని.. తమిళంలో ఎలాంటి సినిమా ఒప్పుకోలేదని, ప్రస్తుతం తన దృష్టి తాను నటిస్తున్న మూడు ప్రాజెక్ట్స్ మీదే ఉంది అని, వేరే ఆఫర్స్ ని ఒప్పుకుంటే తానే తెలియజేస్తానని, తన చేతిలో ఉన్న మూడు సినిమాలు అయిపోతే.. అప్పుడు వేరే ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తా అంటుంది కృతి శెట్టి,.

Krithi Shetty Gives A Clarity On Her Rumors:

Krithi Shetty condemns rumours on future projects
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs