Advertisement
Google Ads BL

ఫాన్స్ వెయిటింగ్ ఇక్కడ


యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కి కేవలం రెండు రోజుల టైం మాత్రమే ఉంది. ఎన్టీఆర్ ఫాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ ఎలా ఉండబోతుంది. కొరటాల మూవీ నుండి ఎలాంటి అప్ డేట్ రాబోతుంది అని కలలు కంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ పుట్టిన రోజుని మిస్ అయ్యి తెగ ఫీలైన ఎన్టీఆర్ ఫాన్స్ ఈసారి తగ్గేదే లే అంటున్నారు. ఇక ఆర్.ఆర్. ఆర్ నుండి కొమరం భీం గా ఎన్టీఆర్ పోస్టర్ వస్తుంది అని ఫిక్స్ అయినా .. సెకండ్ వేవ్ టైం లో సెలెబ్రేషన్స్ కి దూరంగా ఉంటున్న టాలీవుడ్ ని చూస్తే ఎన్టీఆర్ ఫాన్స్ కి ఎక్కడో చిన్న టెంక్షన్స్. కనీసం ఎన్టీఆర్ పుట్టిన రోజు ట్రీట్ ఉంటుంది అని ఆర్.ఆర్.ఆర్ టీం చెప్పినా చాలు అని ఎదురు చూస్తున్నారు.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ బర్త్ డే దగ్గరకొచ్చేసింది.. ఎవరూ ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు అంటూ కాస్త అసహనంగా కనిపిస్తున్నారు ఫాన్స్. మరోపక్క కొరటాల శివ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ అయినా, హీరోయిన్ అప్ డేట్ అయినా ఇస్తారనే ఊహాగానాలు ఉన్నప్పటికీ.. కొరటాల శివ నుండి ఇంత ఎర్లీ గా అప్ డేట్ రాకపోవచ్చు అంటున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ నుండి ఎన్టీఆర్ బర్త్ డే అప్ డేట్ ఉండబోతుంది అని చిన్న హింట్ ఇచ్చిన చాలనే ఆశతో ఫాన్స్ ఉన్నారు. అందుకే ఆర్.ఆర్.ఆర్ నిర్మాణ సంస్థ దానయ్య ఎంటెర్టైన్మెంట్స్ కి ఎన్టీఆర్ ఫాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు.. ఫాన్స్ వెయిటింగ్ .. ప్లీజ్ అప్ డేట్ అంటూ..

Fans are waiting here :

Rajamouli Might Unveil A Special Komaram Bheem Update On Jr NTR Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs