Advertisement
Google Ads BL

హీరో రామ్ ఎమోషనల్ పోస్ట్


హీరో రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో బైలింగువల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా బర్త్ డే ని సింపుల్ గా చేసుకున్న రామ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రామ్ తాతగారు ఈ రోజు మంగళవారం మృతి చెందిన విషయాన్నీ రామ్ ఓ ఎమోషనల్ పోస్ట్ తో సోషల్ మీడియా లో షేర్ చేసాడు. తమ ఫ్యామిలీ కోసం తన తాతగారు చాలా కష్టపడ్డారని, తాతయ్య విజయవాడలో ఓ లారీ డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించారని.. ఆతర్వాత ఉన్నత శిఖరాలకు చేరిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది.

Advertisement
CJ Advs

ఫ్యామిలీ మొత్తానికి సకల సౌకర్యాలు, వసతులు అందించడం కోసం అప్పట్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవాళ్లు. మీది రాజు లాంటి మనసు. జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ఉన్నవాళ్లు కాలేరని, కేవలం మంచి మనస్సు వల్లే ప్రతిఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు. ఇప్పుడు మీ పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి మీరే కారణం. కానీ ఇప్పుడు మీరు లేరు అనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. మీ మరణవార్త నన్ను  కలచివేసింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా.. ( From humble beginnings of a lorry driver in Vijayawada sleeping with lorry tires under your bed to providing & caring for your family,you’ve always had the heart of a King. You’ve shown us that richness comes not from what’s in your pocket but from what lies in your heart.) అంటూ రామ్ వాళ్ళ తాతగారి గురించి చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Ram pens emotional note after grandfather death:

 Ram grandfather passed away
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs