Advertisement
Google Ads BL

ఫహద్ - విజయ్ సేతుపతి: ఎక్స్ చేంజ్


తెలుగులో సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న పుష్ప మూవీ లో విలన్ రోల్ కి మొదటగా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ని తీసుకోగా.. విజయ్ సేతుపతి ముందు ఓకె చెప్పి తర్వాత పుష్ప నుండి తప్పుకున్నాడు. అయితే సుకుమార్ విజయ్ సేతుపతి ప్లేస్ లోకి ఎవరిని తీసుకోవాలి అనేదానిమీద చాలారోజులు అలోచించి చివరికి మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ ని తీసుకున్నాడు. ఇప్పటికే పుష్ప షూటింగ్ లో జాయిన్ అయిన ఫహద్ ఫాజిల్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేకిచ్చేసాడు. అయితే ఇక్కడ విజయ్ సేతుపతి ప్లేస్ లోకి ఫహద్ వచ్చాడు.

Advertisement
CJ Advs

అక్కడ తమిళంలో ఫహద్ ప్లేస్ లోకి విజయ్ సేతుపతి వచ్చాడు. మాస్టర్ మూవీలో విజయ్ సేతుపతి పెరఫార్మెన్స్ కి వచ్చిన క్రేజ్ తో లోకేష్ కనకరాజ్ తన నెక్స్ట్ మూవీ విక్రమ్ కోసం కూడా విజయ్ సేతుపతినే విలన్ గా తీసుకుంటున్నాడట. అంటే విజయ్ సేతుపతి కమల్ హాసన్ కి విలన్ గా విక్రమ్ లో ఆయనతో తలపడబోతున్నాడు. అసలైతే కమల్ కి విలన్ గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఎంపికయ్యాడు. కానీ ఇప్పుడు ఫహద్ ప్లేస్ లోకి విజయ్ సేతుపతి వచ్చాడు. మాస్టర్ విడుదల కాకముందు లోకేష్ ఫహద్ ని విలన్ గా అనుకున్నా మాస్టర్ విడుదలయ్యాక విజయ్ సేతుపతి విలన్ పెరఫార్మెన్స్ కి వచ్చిన క్రేజ్ కమల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని ఫహద్ ప్లేస్ ఎలోకి విజయ్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలా ఫహద్ అండ్ విజయ్ లు విలన్స్ గా తెలుగు, తమిళ్ కి ఎక్స్ చేంజ్ అయ్యారన్నమాట.

Vijay Sethupathi to play Kamal Haasan villain in Vikram:

Vijay Sethupathi Approached For Kamal Haasan Vikram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs