నిన్నమొన్నటివరకు శేఖర్ కే చంద్ర అంటే ఎవ్వరికి పెద్దగా తెలియని పేరు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో మల్టీస్టారర్ గా అయ్యప్పన్ కోషియమ్ మూవీ ని తెరకెక్కిస్తున్న శేఖర్ కే చంద్ర అంటే ఇప్పుడో పెద్ద సెలెబ్రిటీ. అయ్యప్పన్ కోషియమ్ పవన్ తో రీమేక్ చేస్తున్నాడనగానే పవన్ ఫాన్స్ దృష్టిలో అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. పవన్ కళ్యాణ్ మరో హీరో రానా తో తలపడే పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. రానా - పవన్ మధ్యన ఈగో క్లాష్ తో సినిమా మొత్తం యాక్షన్ తో కూడుకుని ఉంటుంది. ఇప్పటికే ఏకే రీమేక్ రెండు షెడ్యూల్స్ షూటింగ్ చిత్రీకరించుకోగా.. మూడో షెడ్యూల్ పొల్లాచ్చిలో జరగాల్సి ఉంది.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్, పవన్ కి కరోనా రావడంతో ఏకే రీమేక్ షూటింగ్ వాయిదా పడింది. ఇక త్రివిక్రమ్ కనుసన్నల్లో జరుగుతున్న ఏకే రీమేక్ షూటింగ్ సంగతి ఎలా ఉన్నా నేడు శేఖర్ కే చంద్ర బర్త్ డే కి పవన్ ఫాన్స్ ఆయనకి లైఫ్ లో మర్చిపోలేని ట్రీట్ ఇచ్చారు. అది ఈ రోజు ఉదయం నుండే సోషల్ మీడియాలో అంటే ట్విట్టర్ లో #PSPKRanaMovie హాష్ టాగ్ తో శేఖర్ కే చంద్ర కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఒక్కసారిగా శేఖర్ కే చంద్ర ట్విట్టర్ లో ట్రెండ్ అవడం చూస్తే పవన్ ఫాన్స్ తలుచుకుంటే ఎవరినైనా సెలెబ్రిటీని చేసేస్తారు అనేది నిరూపితమైనట్లే. ఇక ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న శేఖర్ కే చంద్ర కి సినీ జోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.