Advertisement
Google Ads BL

ఈసారి ఓటిటీలకి మొండి చెయ్యే


గత ఏడాది లాక్ డౌన్ లో ఓటిటీలు ఎలాగోలా చాలా సినిమాలును కొనేసి డైరెక్ట్ గా రిలీజ్ చేసాయి. ఎక్కువో తక్కువో.. చాలా సినిమాలు థియేటర్స్ కోసం వేచి చూడలేదు. లాభమో, నష్టమో నిర్మాతలు కూడా కొన్ని సినిమాల్ని వదిలించుకున్నారు. కానీ ఈ ఏడాది పరిస్థితి అలా లేదు.. సెకండ్ వెవ్ వచ్చి వరసగా రెండు మూడు నెలలు థియేటర్ క్లోజ్ అయినా సినిమాలేవీ ఓటిటికి వచ్చే సూచనలు కనిపించడం లేదు. గత ఏడాది ఓటిటీలకి అమ్మకుండా థియేటర్స్ కోసం వేచి చూసిన క్రాక్, ఉప్పెన, జాతి రత్నాలు సూపర్ హిట్లు అవ్వగా.. ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వంటి సినిమాలు థియేటర్స్ లో బ్రేక్ ఈవెన్ సాధించాయి. 

Advertisement
CJ Advs

దానితో ఈ లాక్ డౌన్ కి ఓటిటి లు భారీ ఆఫర్స్ తో వెంటపడుతున్నా దర్శకనిర్మాతలెవరూ  లొంగడం లేదు. అర్జెంట్ ఏం లేదు.. లాక్ డౌన్ అయ్యాక థియేటర్స్ ఓపెన్ అయ్యాకే మా సినిమాలు విడుదల చేస్తామని భీష్మించుకుని కూర్చుంటున్నారు. అందులో రవిజేత ఖిలాడీ నిర్మాతలు మా సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అంటూ ప్రెస్ నోట్ ఇచ్చేసారు. ఇక నాగ చైతన్య లవ్ స్టోరీ, నాని టాక్ జగదీశ్, రానా విరాటపర్వం, వెంకీ నారప్ప, దృశ్యం ఇలా ఏ మూవీ ఓటిటికి అమ్మెందుకు ఆయా నిర్మాతలు సిద్దంపడడం లేదు. మరి గత ఏడాది లాక్ డౌన్ లో ఓటిటీల ఉరుకులకి.. ఈసారి అడ్డుకట్టపడడమే కాదు.. ఓటిటీలకి దర్శకనిర్మాతలు మొండి చెయ్యే చూపిస్తున్నారు.

OTTs stressing strong content:

Theaters killed by OTT
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs