Advertisement
Google Ads BL

పావలా శ్యామల కన్నీటి కష్టాలు


సినిమా ఇండస్ట్రీలో అందనంత ఎత్తుకుకి ఎదిగినవారు ఉన్నారు.. అధః పాతాళానికి పడిపోయిన వారూ ఉన్నారు. అవకాశాలు ఉన్నప్పుడు గొప్పగా బ్రతికిన వారే చివరి దశలో నానా కష్టాలు పడినవారు, పడుతున్నవారు కోకొల్లలు. చాలామందికి కోవిడ్ మహమ్మారి హాస్పిటల్ పాలు చెయ్యగా.. అందులో కొంతమంది మరణించిన వారూ ఉన్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడేవారికి చిరంజీవి, మరికొంతమంది సినిమా ప్రముఖులు పెద్దమనసుతో సహాయం చేస్తుంటారు. సినిమాల్లో కమెడియన్ గా, చిన్న చిన్న పాత్రలో మెప్పించిన పావలా శ్యామల ప్రస్తుతము ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనారోగ్యంతో ఇండస్ట్రీకి దూరంగా ఓ అద్దె ఇంట్లో కాలం వెల్లదీస్తున్న పావలా శ్యామలకి కరాటే కళ్యాణి కొద్దిమొత్తంలో సహాయం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
CJ Advs

ఆ వీడియో లో శ్యామల మాట్లాడుతూ 30 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్న నేను ఎన్నో సన్మానాలు చేయించుకున్నాను. ఆరోగ్యం బాగోని కారణంగా సినిమా పరిశ్రమకి దూరమయ్యాను. కొన్నేళ్లుగా మా అమ్మాయి నేను అనారోగ్యంతో బాధపడుతుంటే.. మెగాస్టార్ చిరంజీవి గారు రెండు లక్షల సహాయం చేసారు. కేసీఆర్ గారు ఇచ్చే నెల నెల పెన్షన్ తో బ్రతుకుతున్నాను. మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా సహాయం చేసారు. కేసీఆర్ ఇచ్చే పెన్షన్ మూడు నెలలుగా రావడం లేదు. నాకొచ్చిన అవార్డుని అమ్మి ఇంటి అద్దె కడుతున్నాను.. అంటూ తన ఆర్ధిక సమస్యలను చెప్పి కన్నీటి పర్యంతమైంది పావలా శ్యామల.

Senior most artist pavala syamala about her financial struggle:

Pavala Syamala facing Financial Problems
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs