Advertisement
Google Ads BL

అలా గోపీచంద్ విలన్ ఎంట్రీ


హీరోగా గోపీచంద్ ప్రస్తుతం వరస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ - సంపత్ నందిల సీటిమార్ షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ కి రెడీ అయ్యింది. ఏప్రిల్ 2 నే రిలీజ్ అవ్వాల్సిన సీటిమార్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేసారు. అయితే గోపీచంద్ ముందుగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆయన నటించిన తొలివలపు మూవీ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత అనుకోకుండా గోపిచంద్ విలన్ గా మారిపోయాడు. అది కూడా జయం సినిమాతో. తేజ దర్శకత్వంలో గోపీచంద్ నితిన్ కి విలన్ గా నటించి అదరగొట్టేసాడు. ఆ తర్వాత నిజం, వర్షం మూవీస్ తో గోపీచంద్ విలన్ పెరఫార్మెన్స్ కి అవార్డులు కూడా వచ్చాయి.

Advertisement
CJ Advs

అయితే తేజ దర్శకత్వంలో గోపీచంద్ విలన్ ఎంట్రీ ఆవకాశం ఎలా దక్కిందో ఒకసారి చూసేద్దాం. తేజ అసలైతే జయం కోసం ఓ బాలీవుడ్ నటుడిని విలన్ గా తెలుసుకొంటే.. అతను తేజ అనుకున్నట్టుగా అతను విలనిజాన్ని పండించకపోయేసరికి.. మరోసారి విలన్ కేరెక్టర్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నప్పుడు తేజ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు గోపీచంద్ పేరు చెప్పగా.. గోపీచంద్ కి ఫోన్ చేసి పిలిపించి ఆడిషన్స్ చేసి.. జస్ట్ హెయిర్ స్టైల్ మార్చి నువ్ విలన్ కేరెక్టర్ కి పర్ఫెక్ట్ అని చెప్పడం.. గోపీచంద్ విలన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయాయట. అలా గోపీచంద్ విలన్ గా మారాడన్నమాట. 

Gopichand villain character in Jayam movie:

Gopichand villain character in Jayam movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs