Advertisement
Google Ads BL

గని ఆగిపోవడానికి కారణాలు


మెగా హీరో వరుణ్ తేజ్ వరస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్కన అనిల్ రావిపూడి ఎఫ్ 3 అలాగే మరొకటి గని మూవీ. గని సినిమా స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతుంది. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్న ఈ సినిమాని కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాదే మొదలు కావల్సిన షూటింగ్ కరోనా లాక్ డౌన్ వలన ఆగింది. అయితే జులై లో రిలీజ్ చేస్తున్నట్లుగా రిలీజ్ డేట్ ఇచ్చిన గని మూవీ షూటింగ్ ఆగిపోయింది అని, గని స్క్రిప్ట్ విషయంలో వరుణ్ తేజ్ సంతృప్తిగా లేడంటూ, అలాగే సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని అతను దర్శకుడిని డిమాండ్ చేస్తున్నట్లు న్యూస్ లు ప్రచారం లోకి వస్తున్నాయి.

Advertisement
CJ Advs

అంతేకాకుండా దర్శక - నిర్మాతల మధ్య విబేధాలు ఏర్పడ్డాయని.. దాంతో గని సినిమా షూటింగ్ ఆగిపోయింది అంటూ పలు న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే గని పై వస్తున్న పుకార్లకు దర్శకుడు కిరణ్ చెక్ పెట్టాడు. వరుణ్ తేజ్ చేతికి గాయమవడంతో గని షూటింగ్ ఆగింది అని, గని సినిమా విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, వరుణ్ తేజ్ కథ విషయంలో కలగజేసుకుంటున్నాడనేది అబద్దమని, కరోనా సెకండ్ వేవ్, అలాగే విదేశీ ఫైటర్స్ అందుబాటులో లేని కారణంగా గని షూటింగ్స్ ని ఆపాల్సి వచ్చింది అంటూ క్లారిటీ ఇచ్చాడు కిరణ్.

Rumours on Varun Tej Ghani:

Varun Tej disappointed with delay in Ghani shooting?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs