రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ - రానా కాంబోలో తెరకెక్కిన బాహుబలి పాన్ ఇండియా లెవల్లో విడుదలయ్యాక చాలామంది పాన్ ఇండియా సినిమాల వైపు మొగ్గు చూపారు. ఆ సినిమా తర్వాత స్టార్ హీరోలు పాన్ ఇండియా ఫిలిం చెయ్యాలనే కుతూహలంతో దర్శకులని పాన్ ఇండియా కథలు రాయమని ప్రోత్సహించారు. అయితే బాహుబలి కన్నా ముందే స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రని బయో పిక్ గ తెరకెక్కించాలని తేజ దర్శకత్వంలో తలపెట్టిన బాలకృష్ణ.. కొన్ని కారణాల వలన దర్శకుడిని మార్చి క్రిష్ ని రప్పించి.. స్క్రిప్ట్ రెడీ చెయ్యమంటే, ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లు అయ్యింది. ఆ రెండు పార్ట్ లు కాస్త కథానాయకుడు అయ్యింది, మహానాయకుడు అయ్యింది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు ముక్కలవడంతో ఫలితానికి రెక్కలొచ్చింది. అనుకున్న, ఆశించిన ఫలితం ఆ బయోపిక్ ఇవ్వలేకపోయింది.
అప్పుడు బాలకృష్ణ - క్రిష్ లు చేసిన తప్పే ఇప్పుడు సుకుమార్ - బన్నీ లు చేస్తున్నారా? బాహుబలి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత మళ్ళీ అంత డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నది సుకుమార్ - బన్నీలే. పుష్ప ని రెండు పార్ట్ లు గా విడుదల చేద్దామని డిసైడ్ అయ్యారు. అంటే రంగస్థలం హిట్ మీదున్న డైరెక్టర్, అలా వైకుంఠపురములో ఊపుమీదున్న హీరో.. ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా? లేదా వాళ్ళు చేసేది కరెక్ట్, సినిమా హిట్ కొట్టి చూపిస్తారా.. అనేది వేచి చూడాలి. కానీ పుష్ప రెండు పార్ట్ లకి వెళ్లడం అనేది రిస్క్ అవుతుంది అంటూ అందరూ అంచనా వేస్తున్నారు.