Advertisement
Google Ads BL

అరెస్ట్ తో రాజు గారి రగడకి అడ్డు కట్ట


ఏపీలో వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసాక.. ఊరు పేరు తెలియని వారంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. కొడాలి నాని, రోజా, బుగ్గన, బొత్స లాంటి వాళ్ళు తప్ప వైసిపిలో తెలిసిన మొహాలు కానీ, చూసిన మొహాలు కానీ లేవు. అయితే వైసిపి ప్రభుత్వం ఏపీలో పాలన స్టార్ట్ చేసాక వైసిపి నుండి నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచి పార్లమెంట్ కి వెళ్లిన ఎంపీ రఘురామా కృష్ణం రాజుకి ఏపీ సీఎం జగన్ తో విభేదాలు తలెత్తడం, అప్పటినుండి ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు చెయ్యడం, వైసిపి మంత్రులని కూడా వదలకుండా వాళ్లపై రఘురామా కృష్ణరాజు చెలరేగిపోతున్నారు.

Advertisement
CJ Advs

సొంత ఎంపీ.. తమ ప్రభుత్వాన్నే రోడ్డుకీడుస్తుంటే.. చూస్తూ ఉండిపోయిన వైసిపి సర్కార్ ఇప్పుడు ఆయన పై చర్యల కోసం రెడీ అయ్యింది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ రఘురామపై వైసీపీ సర్కారు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఈరోజు హైదరాబాద్ లోని రఘురామా నివాసానికి వెళ్లిన ఏపీసీఐడీ అధికారులు కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అరెస్ట్ చేశారు. ఏపిసిఐడికి రఘురామరాజు కి మధ్యన చాలా వాగ్వాదం జరిగింది. రఘురామకృష్ణరాజుపై 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఆయనని తమ వెంట తీసుకువెళ్లారు సీఐడీ అధికారులు. మరి ఆయన్ని అరెస్ట్ చేయించి తమకి తమ ప్రభుత్వానికి పట్టిన దరిద్రాన్ని వైసిపి వదిలించుకున్నట్టే అని వై.సి.పి అభిమానులు ఆనందంతో గంతులు వేస్తున్నారు.

MP Raghu Rama Krishnam Raju Arrest:

Big Breaking: YCP MP Raghu Rama Krishnam Raju Arrest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs