ప్రతి ఈద్ కి తన సినిమాలతో అభిమానులని ఎంటర్టైన్ చేసే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఏడాది ఈద్ కి రాధే తో వచ్చేసాడు. థియేటర్స్ బంద్ అయినా తన సినిమా రాధే ని ఓటిటి లో రిలీజ్ చేసాడు సల్మాన్ ఖాన్. ముంబై క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన రాధే చిత్రం జీ ప్లెక్స్ లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ యాక్షన్ హీరోగా కనిపించిన రాధే మూవీకి నెగెటివ్ టాక్ రావడమే కాదు, నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు విశ్లేషకులు. రొటీన్ ఫార్ములా స్టోరీని సల్మాన్ ఖాన్ ఎలా ఓకె చేసాడు, దిశా పాటని గ్లామర్ కి, అందాల ఆరబోతకు తప్ప ఉపయోగం లేదని, ప్రభుదేవా డైరెక్షన్ సలు బాగోలేదంటూ రాధే సినిమాని నెటిజెన్స్ ఆడుకుంటున్నారు.
అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ రాధే మూవీకి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేఖత మొదలైంది. అంటే చెప్పడానికి స్పెషల్ గా ఏం లేదు. బాలీవుడ్ నేపోటిజంపై ఎప్పటినుండో నెటిజెన్స్ నుండి ఆవస్తున్న వ్యతిరేకతే సల్మాన్ రాధే కి తగిలింది. సోషల్ మీడియాలో సల్మాన్ రాధే చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని నెటిజన్స్ పెద్ద ఎత్తున #BoycottRadhe హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. దీనికి అసలు కారణం చెప్పకుండానే #BoycottRadhe హాష్ టాగ్ తో నెటిజెన్స్ రాధే మూవీపై విషం చిమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ #BoycottRadhe ట్విట్టర్ లో ట్రేండింగ్ లో ఉంది.