Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ హెల్త్ అప్ డేట్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యన కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. డాక్టర్స్ తో కాంటాక్ట్ లో ఉంటూ ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ హోమ్ ఐసోలేషన్ లో ఉండగా ఓ హాలీవుడ్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో RRR సినిమా విషయాల దగ్గరనుండి.. ఆయన నటించబోయే నెక్స్ట్ సినిమా విషయాల వరకు పంచుకున్నారు. అలాగే హాలీవుడ్ అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు నేనూ అంతే అంటూ ఓపెన్ గా చెప్పిన ఎన్టీఆర్ కరోనా నుండి కోలుకుంటున్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

ఈ రోజు రంజాన్ పర్వదినం సందర్భంగా ఎన్టీఆర్ రంజాన్ పండుగ స్పెషల్ గా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ.. ప్రస్తుతం తన హెల్త్ కండిషన్ బాగానే ఉంది అని, ఆరోగ్యం బాగవుతుంది అని, త్వరలోనే కరోనా నుండి నెగెటివ్ రిపోర్ట్ వచ్చి కోలుకుంటా అని, తన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నుండి సురక్షితంగా ఉండాలని, కరోనా జాగ్రత్తలు పాటించాలి అంటూ (Wishing everyone a happy Eid. Thank you one and all for your warm wishes and prayers. I am getting better and hope to test negative soon. Stay safe and take care.) ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. ఎన్టీఆర్ కి కరోనా రావడంతో నారా చంద్రబాబు నాయుడు దగ్గరనుండి టాలీవుడ్ స్టార్ చిరు, మహేష్ వరకు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే.

Ntr Health Update:

Covid positive NTR says getting better, sends Eid wishes to fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs