గత ఏడాది కరోనా కారణంగా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. ఇక ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ నుండే అందరూ మళ్ళీ తమ సినిమాల కోసం సెట్స్ మీదకెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జనవరి నుండి తన సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అయ్యారు. ఇక ఈ ఏడాది వకీల్ సాబ్ తో ఏప్రిల్ 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 9 న ఏకే రీమేక్ తో దిగిపోతాడని అనుకున్నారు. అంత ఫాస్ట్ గా సినిమాలు చేసేస్తున్నారు.. ఈసారి పవన్ ఫాన్స్ కి వరస ట్రీట్స్ అనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ మరోసారి పవన్ కి బ్రేక్ వేసింది. అంతేకాదు సెకండ్ వేవ్ లో పవన్ కళ్యాణ్ కరోనా తో బాగా ఎఫెక్ట్ అయ్యారు. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ తో పవన్ చాలా రోజులుగా రెస్ట్ లో ఉన్నారు.
అయితే మళ్ళీ క్రిష్ మూవీ హరిహర వీరమల్లు, ఏకే రీమేక్ షూట్స్ కోసం పవన్ ఇప్పుడప్పుడే సెట్స్ మీదకి వెళ్లే ఉద్దేశ్యం కనిపించడం లేదు. అంటే ఈసారి భారీ గ్యాప్ తప్పదంటున్నారు. ఎలాగూ సెకండ్ వేవ్, అందులోను పవన్ కి బావుండలేదు. సో అలా అలా సినిమా షూటింగ్స్ బాగా లేట్ అవడం పక్కాగా కనిపిస్తుంది. ఇకమీదట పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలు అంటూ ఒకేసారి రెండు పడవల మీద కాళ్ళు వెయ్యడం కుదిరేలా లేదు. ఎందుకంటే పవన్ ఆరోగ్యం అంతగా కుదుటపడలేదు. ఆయన ఆరోగ్య రీత్యా కాస్త నెమ్మదిగానే సినిమాల షూటింగ్స్ విషయం చూసుకుంటారనిపిస్తుంది. మరోపక్క రాజకీయాలతోను పవన్ హడావిడి తగ్గిస్తారనే అభిప్రాయాలూ మొదలయ్యాయి.