Advertisement
Google Ads BL

అఖండ లో పూర్ణ పాత్రపై క్లారిటి


బాలకృష్ణ - బోయపాటి కాంబోలో BB3 గా తెరకెక్కుతున్న అఖండ మూవీ మే 28 న రిలీజ్ కి రెడీ కావాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ తో సినిమా పోస్ట్ పోన్ అవ్వబోతుంది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన నటించడానికి చాలామంది హీరోయిన్స్ జంకారు. ఆఖరికి ఢీ డాన్స్ షో ఫేమ్ పూర్ణ, ప్రగ్య జైస్వాల్ లు బోయపాటికి తగిలారు. పూర్ణకి అస్సలు క్రేజ్ లేదు. ప్రగ్య జైస్వాల్ కి బాలయ్య పక్కన కనిపించే ఆహార్యమూ లేదు. అయినా తప్పలేదు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఒకటి అఘోరాగా, రెండోది మాస్ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడు.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో పూర్ణ పాత్రపై అందరిలో కాస్త క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే పెద్దగా ఫేమ్ లేని పూర్ణకి బోయపాటి ఎలాంటి కేరెక్టర్ ఇచ్చాడో అని. అయితే అఖండ లో పూర్ణ పాత్ర నిడివి చాలా చిన్నదట. బాలకృష్ణ భార్య పాత్రలో పూర్ణ అఖండ లో కనిపించబోతుందట. చిన్న పాత్ర అయినా బాలకృష్ణ పక్కన అనేసరికి.. పెద్దగా అవకాశాలు లేని పూర్ణ అంగీకరించిందని అంటున్నారు. అఖండ కథలో ఫ్లాష్ బ్యాక్ లో పూర్ణ కనిపిస్తుందట. నిడివి తక్కువైనా సెకండాఫ్ లో వచ్చే పూర్ణ పాత్ర చాలా బాగుంటుందనీ .. ఆమెకి ఆ కేరెక్టర్ మంచి పేరు తెస్తుందని చెబుతున్నారు.

Poorna playing Balakrishna wife?:

Is Poorna playing a guest role in Akhanda?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs