బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి రంజాన్ కి తాను నటించిన సినిమాలని రిలీజ్ చేసి.. టాక్ తో సంబంధం లేకుండా దుమ్ములేపడం ఆనవాయితీగా వస్తుంది. చాలా సినిమాలని రంజాన్ రోజున రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొల్లగొట్టడం, ఫస్ట్ డే బాక్సాఫీసు రికార్డులని క్రియేట్ చెయ్యడం సల్మాన్ ఖాన్ కొన్నేళ్లుగా చేస్తున్న పని. మరి ఈ ఈద్ రోజున ప్రభుదేవా దర్శకత్వంలో దిశా పటాని హీరోయిన్ గా నటించిన రాధే మూవీ ని రిలీజ్ చేసాడు. దేశం మొత్తం థియేటర్స్ బంద్ అవడంతో.. ఓటిటిలో రాధే మూవీ ని రిలీజ్ చేసాడు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సీటిమార్ సాంగ్ తోనూ, ప్రభుదేవా దర్శకత్వం, దిశా పటాని అందాలు, సల్మాన్ ఖాన్ యాక్షన్ , దేవిశ్రీ మ్యూజిక్ అన్ని కలిపి రాధే మూవీపై భారీ అంచనాలు పెరిగేలా చేసాయి.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా.. తన సినిమాని ఓటిటి నుండి రిలీజ్ చేసేసి ఈద్ శుభాకాంక్షలు తెలియజేసాడు అభిమానులకి సల్మాన్. అయితే సల్మాన్ ఖాన్ చెప్పినట్టుగా, అందరూ ఊహించిన అంచనాలను రాధే మూవీ అందుకోలేకపోయింది. జీ 5 యాప్ నుండి రిలీజ్ అయిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఎప్పటిలాగే రొటిన్ మాస్ మసాలా రివేంజ్ స్టోరీని సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా సినిమా చేసాడని, ఈ సినిమాని వీక్షించిన ప్రేక్షకుల అభిప్రాయం. సినిమా గనక థియేటర్స్ లో విడుదలై ఉంటే సల్మాన్ ఖాన్ అభిమానుల రచ్చ వేరే లెవల్లో ఉండేది. అయినా ఇప్పుడు ఈ సినిమా జీ 5లో ఓటీటీలో విడుదల అయ్యింది. ఓటిటి అయినా ఆయన అభిమానులు దాదాపు 1 మిలియన్ పైగా వ్యూయర్స్ ఒక్కసారిగా హిట్స్ చేయడంతో జీ 5 యాప్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది.. అయితే ఒకేసారి ఈ సినిమాని చూడాలనే ఆత్రంతో అందరూ క్లిక్ చేస్తేనే ఈ పరిస్థితి నెలకొందని జీ 5 వాళ్లు చెబుతున్నారు. మరి సినిమా ప్లాప్ అయినా ఓటిటిలో సల్మాన్ భీభత్సం మాములుగా లేదు.