Advertisement
Google Ads BL

అఖిల్ సినిమాకి రిపేర్లు నిజమేనా


అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాతో పాటుగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే. ఇక రీసెంట్ గా సురేందర్ రెడ్డితో ఏజెంట్ మూవీని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టిన అఖిల్ ఫస్ట్ షెడ్యూల్  ని కంప్లీట్ చేసుకున్నాడని అన్నారు. మాస్ లుక్ తో స్పై గా ఏజెంట్ గా అఖిల్ మేకోవర్ అదిరింది. హాలీవుడ్ స్టయిల్ లో అఖిల్ ని ఏజెంట్ లో సురేందర్ రెడ్డి చూపించబోతున్నాడట. అయితే ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ఇప్పుడొక రూమర్ చక్కర్లు కొడుతోంది. 

Advertisement
CJ Advs

సురేందర్ రెడ్డి అఖిల్ ఏజెంట్ మూవీ స్క్రిప్ట్ లో రిపేర్లు చేస్తున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం కథపై గట్టిగానే కసరత్తు జరుగుతోందట. మరి స్క్రిప్ట్ లాక్ అయ్యాక మళ్ళీ ఇప్పుడు కథలో మార్పులు అంటే సినిమా విషయంలో సురేందర్ రెడ్డి నమ్మకంతో లేడా? అసలే మూడు సినిమాల ప్లాప్ తో ఉన్న అఖిల్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ విషయం ఎలా ఉన్నా ఏజెంట్ పై అక్కినేని ఫాన్స్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ని పక్కనపడేసి.. ఏజెంట్ అఖిల్ గా మాస్ గా సూపర్ హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయంలో ఉన్నారు ఫాన్స్. ఏజెంట్ అంటే.. ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా ఉంటుంది అని ఫిక్స్ అయ్యాక మళ్ళీ మార్పులు చేర్పులు అంటే అంటూ అక్కినేని అభిమానులు కంగారు పడుతున్నారు.

Surender Reddy re-working on Agent script:

Agent regular shooting may be in July or August
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs