దేశమంతా పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ లు పెడుతున్నారు. నరేంద్ర మోడీ ఆయా రాష్ట్రాల నిర్ణయాల మేరకు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రమే లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. అందరికన్నా మహా రాష్ట్ర ముందే మహా రాష్ట్రలో జనతా కర్ఫ్యూ పెట్టడంతో అక్కడ ప్రస్తుతం కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో కేసుల శాతం పెరిగిపోయింది. అయితే మహారాష్ట్రలో మహా జనతా కర్ఫ్యూని మే 31 వరకు పొడిగించే యోచనలో శివసేన ప్రభుత్వం ఉంది. ఇక తెలంగాణలో నిన్నటినుండి మే 21 వరకు లాక్ డౌన్ విధించింది తెలంగాణ ప్రభుత్వం. కేవలం 4 గంటల సడలింపు 20 గంటల లాక్ డౌన్ లో తెలంగాణ రాష్ట్రం ఉంది.
అయితే ఇప్పుడు కరోనా కేసులు లాక్ డౌన్ టైం లో తగ్గుమొహం పట్టడంతో తెలంగాణ సర్కార్ కూడా మే 31 వరకు లాక్ డౌన్ పెంచబోతున్నట్టుగా తెలుస్తుంది. మే 20 న మరోసారి క్యాబ్ నెట్ మీటింగ్ నిర్వహించి లాక్ డౌన్ పెంచే విషయాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టి మే 31 వరకు లాక్ డౌన్ పెంచుతున్నామని ప్రకటన చేయబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూలని పెంచుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చేయబోతుంది.