Advertisement
Google Ads BL

అక్కినేని ఫాన్స్ కి గుడ్ న్యూస్


ఎప్పటినుండో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చిందా? అంటే అవుననే అంటున్నారు. అదేమిటంటే అక్కినేని సమంత టెర్రరిస్ట్ గా నటించిన ఫామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందో  డేట్ వచ్చేసింది అనే టాక్ మొదలయ్యింది. రాజ్ - డీకే ద్వయం బాలీవుడ్ లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ఎప్పుడెప్పుడు అది అమెజాన్ లో పెడతారా అని ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఫ్యామిలిమ్యాన్ 2 కోసం అందరిలో క్యూరియాసిటీ అంతకంతకు పెరిగిపోతుంది.

Advertisement
CJ Advs

ఎప్పుడో ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వాల్సిన ఈ వెబ్ సీరీస్ ని సాంకేతిక కారణంతో పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఇప్పటివరకు దాని గురించిన టాపిక్ తేకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సమంత కోసం టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు వెయిట్ చేస్తుంటే.. మనోజ్ బాజపాయ్ కోసం బాలీవుడ్ మొత్తం వెయిట్ చేస్తుంది. అయితే జూన్ లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ రిలీజ్ కాబోతుంది అనే న్యూస్ వినిపిస్తున్న టైం లో ఫామిలీ మ్యాన్ రాకకై డేట్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. అది జూన్ 11 న కానీ జూన్ 14 న కానీ అమెజాన్ ప్రైమ్ లో ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది.

Family Man 2 Release Date Update:

The Family Man season 2 is gearing up for a big premiere on June 11th via Amazon Prime
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs