ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్ రావడంతో గత రెండు రోజులుగా హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యంపై మహేష్ దగ్గరనుండి చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరు వరకు పరామర్శల వెల్లువ కొనసాగుతుంది. అయితే తాజాగా ఎన్టీఆర్ ఫస్ట్ టైం జాతీయ మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో చాలా విషయాలు ముచ్చటించాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమా విషయాలే కాదు ఆయన తర్వాత సినిమాల విషయంలోనూ ఎన్టీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అది రాజమౌళి తో తాను, రామ్ చరణ్ కలిసి చేసిన సినిమాకి RRR అనే టైటిల్ బాగా ప్రాచుర్యం పొందడంతో దానికి రిలేటెడ్ గా రౌద్రం, రణం, రుధిరం టైటిల్ ని రాజమౌళి పెట్టారని చెప్పాడు.
అలాగే ఆర్.ఆర్.ఆర్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ, అంటే ఇలాంటి లాక్ డౌన్స్ ఎన్ని రోజులు ఉన్నా.. ఆర్.ఆర్.ఆర్ ని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా అని, కొన్ని సినిమాలు ఓటిటి కన్నా థియేటర్స్ లోనే చూడాలని, అసలు ఆర్.ఆర్.ఆర్ ని ఓటిటిలో రిలీజ్ చెయ్యాలని అనుకోలేదని ఎన్టీఆర్ కుండబద్దలు కొట్టారు. అలాగే తనకి పాన్ ఇండియా అనే పదం నచ్చదని, దేశం లోని చాలా భషాల్లో ఓ సినిమాని రిలీజ్ చేసి అందరికి చూపించడం మాత్రమే అని చెప్పాడు. ఇంకా నిజమైన హీరోల గురించి దేశం మొత్తం తెలియాలని, ఆర్.ఆర్.ఆర్ లో తన పాత్ర కొమరం భీం పాత్ర కోసం చాలా పరిశోధన చేశామని చెబుతున్నాడు ఎన్టీఆర్.
ఇక హాలీవుడ్ లో అవకాశం వస్తే ఏ హీరో వదులుకోడు. నేను వదులుకోను అంటూ తన మనసులోని విషయాలని ఆ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కుండబద్దలు కొట్టాడు ఎన్టీఆర్.