ఉప్పెన మూవీ తో టాలీవుడ్ ని ఉప్పెనేలా ముంచెత్తింది కృతి శెట్టి. తెలుగమ్మాయి మాదిరి.. టాలీవుడ్ ప్రేక్షకులని ట్రెడిషనల్ గా పడేసిన కృతి శెట్టి..ఉప్పెన సినిమా రిలీజ్ కి ముందే వరస ఆఫర్స్ ఓ మంచి క్రేజ్ సంపాదించింది. రామ్ తో బైలింగువల్ మూవీ తో పాటుగా నాని శ్యామ్ సింగ రాయ్, అలాగే సుధీర్ బాబు - ఇంద్రగంటి కొత్త సినిమాలోనూ కృతి శెట్టి అవకాశాలు పట్టేసింది. అయితే ఇప్పడు కృతి శెట్టి పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అది డేట్స్ సర్దుబాటు కాక అలా చెప్పిందా? లేదంటే కృతి శెట్టి రేంజ్ మారిందా అనేది మాత్రం ప్రస్తుతం అందరిలో ఉన్న డౌట్.
అది దర్శకుడు తేజ దగ్గుబాటి అభిరామ్ కలయికలో అభిరామ్ డెబ్యూ మూవీ కోసం కృతి శెట్టి ని హీరోయిన్ కోసం సంప్రదించగా.. కృతి శెట్టి తేజ ఆఫర్ కి నోచెప్పింది అనే టాక్ నడుస్తుంది. పారితోషకం పరంగా కూడా కృతి శెట్టి ఎక్సపెక్ట్ చెయ్యనంత ఇస్తామని చెప్పినా కృతి శెట్టి నో చెప్పింది అంటే.. కారణం కాల్షీట్స్ సర్దుబాటు చెయ్యలేక? లేక అభిరామ్ సినిమాలో ఎందుకు అనుకుందా? అనేది మాత్రం అంతుబట్టడం లేదు. ఇప్పటికే స్క్రిప్ట్ అన్ని పూర్తి అయిన అభిరామ్ మూవీకి కృతి శెట్టి అయితే బావుంటుంది అనుకుంటే ఆమె నో చెప్పడంతో తేజ మరో హీరోయిన్ కోసం వెతుకులాటలో ఉన్నాడట.