Advertisement
Google Ads BL

ఈ టైం ని క్యాష్ చేసుకో సామ్


దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ తో కర్ఫ్యూనో, లేదంటే లాక్ డౌన్ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా థియేటర్స్ లేవు. సినిమాలు లేవు. ఎంతసేపని అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లో పాత సినిమాలు చూస్తారు. పాత వెబ్ సీరీస్ లు చూస్తారు. ఇలాంటి టైం లో ఏ మూవీ అయినా ఓటిటిలో రిలీజ్ అయినా, లేదంటే ఏ వెబ్ సీరీస్ అయినా ఓటిటిలో వదిలినా.. దానికి క్రేజ్ మాములుగా ఉండదు. కానీ ఓ పాపులర్, సూపర్ హిట్ వెబ్ సీరీస్ కి సీక్వెల్ గా రాబోతున్న ఫ్యామిలీ మ్యాన్ 2 ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియడమే లేదు. ముందు ఫిబ్రవరి అన్నారు. కారణం చెప్పకుండా పోస్ట్ పోన్ చేసి మే అన్నారు. ఇంతవరకు ఆ వెబ్ సీరీస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో డేట్ ఇవ్వలేదు.

Advertisement
CJ Advs

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు దేశం మొత్తం ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం వెయిటింగ్. తెలుగులో సమంత అక్కినేని నెగెటివ్ రోల్ పోషించింది అనగానే క్యూరియాసిటిలో ప్రేక్షకులు ఫాన్స్ కొట్టుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు సామ్ విలనిజం చూద్దామా అని వెయిట్ చేసే కొలది అది వెనక్కి పోతుంది. సామ్ కూడా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ ముగించేసింది. ఈ లాక్ డౌన్ టైం లో గనక  ఆ వెబ్ సీరీస్ డేట్ ఇచ్చి రిలీజ్ చేస్తే.. అబ్బబ్బ దానికున్న క్రేజ్ కి అది బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం. ఫ్యామిలీ మ్యాన్ ఇప్పటికే హిట్ అవడంతో ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి. 

కానీ దాన్ని రిలీజ్ చెయ్యడానికి దర్శకనిర్మాతలు తెగ ఆలోచించేస్తున్నారు. జూన్ లో రిలీజ్ అంటున్నారు. డేట్ ఇవ్వకుండా ఇంకా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు కానీ.. రిలీజ్ డేట్ చెప్పడం లేదు.. సమంతని మాత్రం తమరి రాక మాకెంతో ఆనందం సుమండీ అంటూ ఆహ్వానించినా సామ్ కూడా ఫ్యామిలీ మ్యాన్ 2 రాక పై క్లారిటీ ఇవ్వడం లేదు.

The family man season 2: Release date latest trend:

The family man season 2  Release date update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs