Advertisement
Google Ads BL

ప్రశాంత్ నీల్ తో కన్ఫర్మ్ చేసిన ఎన్టీఆర్


ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో పై ఎప్పటినుండో ప్రచారం జరగడం కాదు.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ ఓకె కూడా అయ్యింది. కానీ మధ్యలో కెజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ మూవీ కి ఓకె చెప్పడం, ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రమ్ కి కమిట్ అవడంతో ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ మూవీ ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది. ఇక ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రమ్ తో NTR30 కి కమిట్ అయినా.. తర్వాత త్రివిక్రమ్ స్థానంలోకి కొరటాల శివ రావడం, ప్రశాంత్ నీల్ సలార్ తర్వాత అల్లు అర్జున్ తో మూవీ ఉండొచ్చనే న్యూస్ తర్వాత ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీపై అనేక సందేహాలు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఎన్టీఆర్ ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ తో మూవీ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసేసాడు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ తో హోమ్ క్వారంటైన్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ జాతీయ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తాను ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివ తో మూవీ చేయబోతున్నా అని, కొరటాల శివ తో తాను చేసిన జనతా గ్యారేజ్ హిట్ అయ్యింది అని, మళ్ళీ ఇప్పుడు అదే కాంబోలో మూవీ సెట్ అయ్యింది అని చెప్పిన ఎన్టీఆర్.. కొరటాలకి తనకి స్క్రిప్ట్ మీద ఓ అవగాహన ఉంది అని, అలాగే ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని చెప్పాడు ఎన్టీఆర్.

ఆ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ లో కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ ఉన్నట్లుగా ఎన్టీఆర్ కన్ ఫర్మ్ చేసిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంటే NTR31 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఉండబోతుంది అనేది ఎన్టీఆర్ ఫాన్స్ కి క్లారిటీ వచ్చేసింది. మరి కెజిఎఫ్ 2 టీజర్ చూసాక హీరో ఎలివేషన్ సీన్స్ తో పిచ్చెక్కిపోయిన ఎన్టీఆర్ ఫాన్స్ కి ప్రశాంత్ నీల్ ఎక్కడ మిస్ అవుతాడో.. ఎన్టీఆర్ కి మాస్ ఎంటర్టైనర్ మిస్ అవుతుంది అని కంగారు పడ్డారు. ఇప్పుడు ఫాన్స్ కి NTR31 పై ఓ స్పష్టత  వచ్చేసింది. 

NTR confirms film with KGF director:

Tarak confirms film with KGF director Prashanth neel
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs