ఓటిటీలు కొనాలంటే సినిమాలుండాలిగా


గత ఏడాది లాక్ డౌన్ లో థియేటర్స్ కి తాళాలు పడే టైం కి ఓ పది పదిహేను సినిమాలు రిలీజ్ కి సిద్దమైపోయాయి. పది పదిహేనేమేమిటి చిన్న చితకా ఇలా చాలా సినిమాలు రిలీజ్ కి సిద్దమై థియేటర్స్ కోసం కాపు కాయకుండా కొన్ని ఓటిటీలకి వెళితే ఒకటో రెండో థియేటర్స్ కోసం వెయిట్ చేసాయి. గత ఏడాది చాలా సినిమాలు నాని వి, ఆకాశమే నీ హద్దురా, నిశ్శబ్దం లాంటి సినిమాలే ఓటిటిలో రిలీజ్ అయ్యాయి. తొమ్మిదినెలల లాక్ డౌన్. అందుకే కొంతమంది నిర్మాతలు తమ సినిమాలని ఓటిటికి అమ్మేసారు. 

ఇక లాక్ డౌన్ ముగిసి మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనే టైం కి సెకండ్ వేవ్ మహంకాళిలా విరుచుకుపడింది. దానితో నాలుగైదు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్దమైనవి పోస్ట్ పోన్ చేసారు. మిగతా సినిమాలు ఇంకా షూటింగ్ లే పూర్తి కాలేదు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి దగ్గరైన సినిమాల్లో నాగ చైతన్య లవ్ స్టోరీ, నాని టక్ జగదీశ్, ఏక్ మినీ ప్రేమ కథ, ఇష్క్, రానా విరాట పర్వం, వెంకీ నారప్ప, దృశ్యం 2 మూవీస్  ఉన్నాయి తప్ప.. మిగతా సినిమాలేవీ షూటింగ్ పూర్తి చేసుకోలేదు. 

షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ ఆగిన సినిమాలు వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. అందులో అనసూయ థాంక్యూ బ్రదర్ ఓటిటిలో రిలీజ్ అయ్యింది. ఇక ఓటిటీలు కొనడానికి ఈ ఐదారు సినిమాలు తప్ప ఇంకేం లేవు. ఆచార్య, అఖండ, ఖిలాడీ, కెజిఎఫ్, రాధేశ్యామ్ ఇలా చాలా సినిమాల షూటింగ్స్ పూర్తి కాకుండా.. ఓటిటీలు ఎగబడినా వెస్ట్. కొనడానికి సినిమాలుండాలి.. అమ్మడానికి అవి పూర్తయి ఉండాలి. 

If you want to buy OTT like movies:

If you want to buy OTT like movies
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES