Advertisement
Google Ads BL

లాక్ డౌన్ పెట్టలేదని అంటుంది.. పెడితే ఇలా


తెలంగాణ హై కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడుకుంటుంది. తెలంగాణ లో కరోనా కట్టడి కోసం నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ పెడతారా లేదంటే మేమే పెట్టాలా అంటూ వార్నింగ్ ఇచ్చిన కొద్ది గంటల్లో తెలంగాణ గవర్నమెంట్ నైట్ కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. ఇక గత వారం రోజులుగా కరోనా లెక్కలు తక్కువ చూపుతున్న కారణముగా హై కోర్టు మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్ డౌన్ పై, మినీ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోమని తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన కొన్ని గంటల్లో కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెట్టి రేపటినుండి ఓ పది రోజుల పాటు లాక్ డౌన్ పెడుతున్నట్లుగా ప్రకటించింది.

Advertisement
CJ Advs

ఇక కోర్టు చెప్పింది కదా అని ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తే ఇప్పుడు హై కోర్టు.. ఈ రోజు ఉదయం మేము చెప్పేవరకు లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచన లేదు.. ఒక్కసారిగా రేపటినుండి లాక్ డౌన్ అంటే ఎలా. ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ టైమ్‌లో తమ ప్రాంతాలకు ఎలా వెళతారని  ప్రశ్నించింది. గతేడాది వలస కార్మికులు ఇబ్బందులు పడినట్లు ఈ సారి ఇబ్బంది పడకుండా చూడాలని.. రోజువారీ కూలీల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలని అడగగా.. 50 శాతం మంది తమ సొంత ఊర్లకి వెళ్లిపోయారని తెలంగాణ సీఎస్ కోర్టుకు తెలిపింది. 

High Court Warning To Telangana Govt:

High Court Serious On Telangana Govt Over Corona Situation in Telangana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs