Advertisement
Google Ads BL

లైటింగ్ సూరిబాబుగా సుధీర్ బాబు


కృష్ణ అల్లుడు, మహేష్ బావ సుధీర్ బాబు అనే స్థాయి నుండి హీరో సుధీర్ బాబు అనే స్థాయికి చేరుకున్నాడు సుధీర్ బాబు. కొత్త తరహా కథలకి ప్రాధాన్యతనిస్తూ తనకంటూ ప్రత్యేక  స్థానాన్ని సంపాదించుకున్నాడు. తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ విలన్ కేరెక్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాని - సుధీర్ బాబు కలయికలో గత ఏడాది వి సినిమాతో ప్రేక్షకులు పలకరించిన సుధీర్ బాబు లేటెస్ట్ చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. పలాస డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీదేవి సోడా కంపెనీ ఫస్ట్ లుక్ తోనే అందరిని ఆకట్టుకుంది.

Advertisement
CJ Advs

నేడు సుధీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా శ్రీదేవి సోడా సెంటర్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది అనే విషయం.. ఈ గ్లింప్స్ చూస్తే అర్ధమవుతుంది. విలేజ్ లో జాతర జరిగే ప్రదేశంలో సోడా సెంటర్ నడుపుకునే యువకుడిగా సూరిబాబు పాత్రలో సిక్స్ ప్యాక్ తో ఈ సినిమాలో సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. ఇక సుధీర్ బాబు ఈ సినిమా కాకుండా ఇంద్రగంటి దర్శకత్వంలో మరో సినిమా ని మొదలు పెట్టాడు. మరి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సుధీర్ బాబు కి సినీ జోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Sudheer Babu glimpse from Sridevi Soda Center:

Sudheer Babu glimpse from Sridevi Soda Center: impressive
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs