దేశం లోని 14 రాష్ట్రాలు కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ పెట్టాయి. కఠిన ఆంక్షలతో లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో అందరికన్నా ముందు మహా జనతా కర్ఫ్యూ ని అమలు చెయ్యడంతో అక్కడ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక ఢిల్లీ లో లాక్ డౌన్ పెంచుతూ వెళుతుంది కేజ్రీవాల్ సర్కార్. మధ్యప్రదేశ్, యుపి, కేరళ, కర్ణాటక ఇలా కరోనా కేసులు పెరక్కుండా అడ్డుకట్ట వెయ్యడానికి లాక్ డౌన్ పెట్టారు. అయితే ఏపి కాని, తెలంగాణ కానీ లాక్ డౌన్ పెట్టలేదు. ఏపీలో 18 గంటల కర్ఫ్యూని అమలు చేస్తున్నారు ఇక తెలంగాణ కేసీఆర్ మాత్రం తెలంగాణాలో లాక్ డౌన్ పెట్టబోమని స్పష్టంగా చెప్పారు.
కానీ ఇప్పుడు లాక్ డౌన్ పెట్టడం తప్ప మరో మార్గం లేదని లాక్ డౌన్ పెడితేనే కరోనా సాధ్యమని నిపుణుల హెచ్చరిక మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా లాక్ డౌన్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు జరిగే క్యాబినెట్ భేటీలో కేసీఆర్ అధికారుల భేటీలో తెలంగాణాలో లాక్ డౌన్ పెట్టాలా? మినీ లాక్ డౌన్ పెట్టాలా? అనే అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అలాగే ఈటెల రాజేంద్ర నుండి విద్య ఆరోగ్య శాఖని తీసుకుని తన దగ్గరే ఉంచుకున్న కేసీఆర్.. ఆ శాఖని ఎవరికైనా కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.