Advertisement
Google Ads BL

ఆ ముగ్గురు వ్యాక్సిన్ వేయించుకోలేదా?


కరోనా వ్యాక్సినేషన్ పూర్తయితేనే కరోనా కట్టడి సాధ్యం, లాక్ డౌన్ పెట్టడం వలన కొంతవరకే కరోనా ని కట్టడి చెయ్యొచ్చు, మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం.. ఇది నిపుణుల మాట. అందుకే చాలామంది సెలబ్రిటీస్ వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోస్ ని షేర్ చేస్తూ.. మీరు కో వ్యాక్సిన్ వేయించుకోండి, కరోనాని తరిమికొట్టండి అంటూ పేక్షకులకి, ప్రజలకి ధైర్యం చెబుతున్నారు. నరేంద్ర మోడీ దగ్గరనుండి.. టాలీవుడ్ నాగార్జున వరకు చాలామంది కరోనా వ్యాక్సిన్ వేయించుకుని కరోనా తో జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. మరి టాలీవుడ్ పెద్ద చిరు కానీ, వెంకీ కానీ, బాలకృష్ణ కానీ వ్యాక్సిన్ వేయించుకున్న దాఖలాలు లేవు.

Advertisement
CJ Advs

నాగార్జున వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోస్, మోహన్ బాబు వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. చిరంజీవి కానీ, బాలయ్య బాబు కానీ, వెంకటేష్ ఇంకా చాలామంది సినీ ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదా? తీసుకున్నా చెప్పలేదా? అంటూ చాలామంది ఫాన్స్, ప్రేక్షకుల ప్రశ్న. సీనియర్ హీరోలు, టాలీవుడ్ పెద్దలు వీరే వ్యాక్సిన్ వేయించుకోకుండా ఫాన్స్ కి ప్రేక్షకులకి ఏం చెబుదామని. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా కమ్మేసిందో.. సినిమా ప్రముఖులని రోజుకొకరిని కోల్పోతుంటే తెలుస్తుంది. ఈ కరోనా ని తట్టుకుని నిలబడాలంటే కేవలం వ్యాక్సిన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ తప్ప ఇతర మార్గం లేదు.

Didn’t those three get vaccinated?:

<span>Tollywood stars and covid vaccination drive</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs