Advertisement
Google Ads BL

పార్టీ ని పక్కనబెట్టి.. పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాడు


తమిళనాడు అస్సాంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ మాత్రమేనా.. తాను  కూడా ఓటమి పాలైన కమల్ హాసన్ స్టాలిన్ సీఎం గా ప్రమాణస్వీకారమహోత్సవానికి హాజరయ్యారు. కమల్ హాసన్ కి సినిమాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అలా అని ఆయన పార్టీ పెట్టి గెలిచేసే సత్తా ఉందా? అంటే ఉందొ.. లేదో.. ఈ ఎన్నికలే నిరూపించాయి. అభిమానులు కేవలం సినిమాలు చూడడం వరకే, హీరోలని ప్రేమించడం వరకే కానీ.. వాళ్ళని ఎన్నికల్లో గెలిపించే ఉదేశ్యం అభిమానులకి ఉండదు అనేది చిరు, పవన్ తాజాగా కమల్ ని చూస్తే తెలుస్తుంది. గతంలో సినిమా ప్రముఖులు పార్టీ పెట్టి సీఎం అయ్యారంటే అప్పట్లో వాళ్ళ పాపులారిటీ వేరు, ప్రేక్షకుల్లో వారికున్న క్రేజ్ వేరు.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడిలా కాదు. కమల్ హాసన్ పార్టీ ఓడిపోవడంతో ఆయన తో ఉన్న నాయకులంతా ఇప్పుడు పార్టీని వీడడంతో కమల్ కూడా ఇక పార్టీ వ్యవహారాలని పక్కనపడేసి.. సినిమాల విషయంగా పర్ఫెక్ట్ గా పనిచేయాలని డిసైడ్ అవడంతో ఎన్నికలు ముగిసిన తెల్లారే లోకేష్ కనకరాజ్ విక్రమ్ షూట్ లో పాల్గొన్నారు. ఇక తాజాగా ఇండియన్ 2 గొడవల్ని పరిష్కరించి దర్శకనిర్మాతల మధ్యన బేధాభిప్రాయాలు తొలగించి.. ఇండియన్ 2 ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని కమల్ రెడీ అవుతున్నారట. ఇండియన్ 2 కోసం డేట్స్ కూడా ఇచ్చేశారనే టాక్ మొదలైంది. అలాగే మరో రెండు సినిమాలను కమల్ లైన్ లో పెట్టబోతున్నారనే టాక్ నడుస్తుంది.

Kamal Haasan to resolve the Indian 2 issue:

Kamal Haasan Indian 2 movie update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs