Advertisement
Google Ads BL

కంగనాకు మరో షాక్


ఉన్నది ఉన్నట్లుగా, తాను అనుకున్నది అనుకున్నట్లుగా  మాట్లాడగలదు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. కంగనా కి ఎదురెళ్లాలి అంటేనే హీరోలు కూడా వెనకాడతారు. ఇక రాజకీయ నేతలపై కూడా కంగనా విరుచుకుపడుతుంది. బిజెపి కి మద్దతుగా మాట్లాడే కంగానా ఈమధ్యన మమతా బెనర్జీపై, బెంగాల్ అల్లర్లపై నోరు పారేసుకోవడంతో.. ఆమెని ట్విట్టర్ శాశ్వతంగా బ్యాన్ చేసింది. ట్విట్టర్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ కంగనా పోస్టులు పెట్టినందుకు కాను.. ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చెయ్యడమే కాదు.. పూర్తిగా ఆమెని బ్యాన్ చేసింది. కొంతమంది నెటిజెన్స్ ఈ విషయంలో కంగానకి మద్దతుగా నిలిస్తే కొంతమంది విమర్శించారు.

Advertisement
CJ Advs

తాజాగా కంగనాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయాన్నీ కంగనా తన ఇన్స్టా పేజీ లో పోస్ట్ చేసింది. అయితే కంగనా పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ తొలగించింది. కారణం కంగనా కరోనా అనేది చిన్న ఫ్లూ గా అభివర్ణించడంతో నెటిజెన్స్ కంగానని దుమ్మెత్తి పోస్తున్నారు. కరోనా మహమ్మారితో రోజుకి వేలల్లో ప్రాణాలు పోగుట్టుకుంటుంటే.. కంగనా ఇలా కరోనని లైట్ తీసుకున్నట్లుగా చాలామంది కరోనా ని లైట్ తీసుకుంటారని నెటిజెన్స్ కంగనాపై విరుచుకుపడడంతో ఇన్స్టా కంగనా పోస్ట్ ని తొలగించింది.

దానితో కంగనా మరోసారి రెచ్చిపోయింది. ఇన్స్టాగ్రామ్ చేసిన పనిని విమర్శించడమే కాదు.. తాను ఏం అనుకున్నదో దాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కరోనాను అంతం చేద్దామని నేను చేసిన పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తొలిగించింది. ఇలాంటి పోస్ట్ వలన  ఉగ్రవాదులు, కమ్యూనిస్టు సానుభూతిపరులు కేవలం ట్విట్టర్‌లోనే ఉన్నారనుకున్నాను. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలాంటి వారున్నారంటూ ఇన్స్టా పై తన కోపాన్ని వెళ్లగక్కింది కంగనా.

Another shock to Kangana:

Kangana Ranaut says Instagram deleted her post threatening
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs