Advertisement
Google Ads BL

ఆందోళనలో ఎన్టీఆర్ ఫాన్స్


కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మరోసారి సినిమా రిలీజ్ లని, షూటింగ్స్ లని, అసలు సినిమా ఇండస్ట్రీనే అతలాకుతలం చేసింది. గత ఏడాది కరోనా క్రైసిస్ లాక్ డౌన్ అంటూ సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి, రిలీజ్ డేట్స్ మార్చుకుని.. మళ్ళీ ఎలాగోలా ఇండస్ట్రీకి కుదుటపడుతుంది అనుకున్న టైం లో సెకండ్ వేవ్ కమ్మేసింది. గత ఏడాది లాక్ డౌన్ లో ఎన్టీఆర్ బర్త్ డే ని ఫాన్స్ మిస్ అయ్యి డిస్పాయింట్ అయ్యారు. ఆఖరికి ఆర్.ఆర్.ఆర్ నుండి ఎలాంటి ట్రీట్ ఇవ్వలేకపోయేసరికి ఎన్టీఆర్ ఫాన్స్ ఉసురు మన్నారు. కానీ ఈ ఏడాది ఆర్.ఆర్.ఆర్ నుండి ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్ రాబోతుంది.. ఒకటి పోస్టర్ రూపంలో కొమరం భీం ని చూపించబోతున్నారట, అలాగే ఆర్.ఆర్.ఆర్ టీజర్ ట్రీట్ కూడా ఎన్టీఆర్ బర్త్ డే రోజునే ఇవ్వబోతున్నట్లుగా తెలిసింది. 

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతి వలన నిన్న విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా లైగర్ టీజర్ కానీ, లైగర్ పోస్టర్ ని కానీ రిలీజ్ చెయ్యకుండా ఆపేసారు. ప్రజలంతా కరోనా తో అల్లాడుతున్నారు. కరోనా ఉధృతి తగ్గాకే లైగర్ టీజర్ అంటూ విజయ్ దేవరకొండ ఫాన్స్ ని లైగర్ టీం డిస్పాయింట్ చేసేసింది. దానితో విజయ్ ఫాన్స్ బాగా ఫీలయ్యారు. అది చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ కి ఆందోళన మొదలైంది. అంటే ఆర్.ఆర్. ఆర్ నుండి కూడా ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్ రాదేమో.. కరోనా అంటూ మళ్ళీ మమ్మల్ని డిస్పాయింట్ చేస్తావా జక్కన్నా అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ కలవరపడుతున్నారు. మరి రాజమౌళి కరోనా సెకండ్ వేవ్ సిట్యువేషన్ లో ఫాన్స్ కి ట్రీట్ ఇస్తాడో.. డిస్పాయింట్ చేస్తాడో చూడాలి.

NTR Special Surprise To Fans On His Birthday?:

NTR RRR Special Surprise To Fans On His Birthday?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs