Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ వంట - ప్రణతి కామెంట్స్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి నటుడు, మంచి డాన్సర్ అంతేకాదు మంచి చెఫ్ కూడా. ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 అప్పుడు హౌస్ మేట్స్ కి మటన్ బిర్యానీ చేసిపెట్టినప్పుడు ఆయన వంట చేస్తారనే అందరికి తెలిసింది. ఎన్టీఆర్ వంట ఎంత బాగా చేస్తాడో అప్పుడప్పుడు ఆయన ఇంటికి వెళ్లే గెస్ట్ లు చెబుతుంటారు. ఖాళీ సమయాల్లో సాంగ్స్ వింటూ వంట చేస్తుంటాడట ఎన్టీఆర్. ఇంట్లోనే బ్రేడ్ స్లైడ్స్ కూడా తయారు చేసేస్తాడట. ఆ విషయాన్ని ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ చెబుతున్నాడు. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కి ఫోన్ చేసి అన్నయ్య నేను ఇంట్లో వంట చేస్తున్నా నువ్ భోజనానికి వచ్చేయ్ అని చేబుతాడట. ఇక బిర్యానీ అవి బాగా చేస్తుంటాడు. అపుడప్పుడు వేరే డిష్ లు కూడా చేస్తాడు. ఇంకా విశేషం ఏమిటి అంటే ఇంట్లోనే బ్రేడ్ కూడా తయారు చెయ్యగలడు తమ్ముడు అంటూ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వంట విషయాలు చెబుతున్నాడు.

Advertisement
CJ Advs

సినిమా షూటింగ్స్ లేనప్పుడు ఇలా వంట చేస్తూ హోటల్ పెడితే సైడ్ బిజినెస్ లా ఉంటుంది కదా అని ఆటపట్టిస్తుంటామని చెప్పిన కళ్యాణ్ రామ్.. అవును త్మముడు నువ్ వంట చేసేయ్ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసేద్దామని చెబుతాడు. ఇక ఎన్టీఆర్ అయితే నేను వంట చేస్తే మా ఆవిడా అమ్ముతుందట. నువ్ వంట చెయ్ నేను పక్కనబెట్టి అమ్మేస్తాను అని చెబుతుంది.. నేను వంట చేస్తే ప్రణతి అమ్మేస్తుందట. నా వంట నేను తినడానికి ఫ్రెండ్స్ కి పెట్టడానికి తప్ప అమ్మడానికి, బిజినెస్ చెయ్యడానికి కాదు అంటూ ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూ లో ఫన్నీగా మాట్లాడారు.

NTR Cooking-Pranati Comments:

Ntr cooks Masthan BIryani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs