Advertisement
Google Ads BL

అది మల్టీస్టారర్ కాదు


కరోనా నుండి కోలుకున్నాక అనిల్ రావిపూడి మళ్లీ ఎఫ్ 3 షూటింగ్ మొదలు పెడతాడేమో అనుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని షూటింగ్స్ ని ఆపుతున్నట్టుగానే అనిల్ రావిపూడి కూడా ఎఫ్ 3 షూటింగ్ ని ఆపేసాడు. అనిల్ రావిపూడి కరోనా విపత్కర పరిస్థితుల నుండి కోలుకున్నాక తనకి కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది అని, కరోనా తో చాలా బలంగా పోరాడనంటూ మెసేజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎఫ్ 3 షూటింగ్ వాయిదా పడడంతో పాటుగా.. సినిమా కూడా ఆగష్టు లో విడుదలయ్యే ఛాన్స్ లేదని చెబుతున్నారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం అనిల్ రావిపూడి అటు యూట్యూబ్ ఇంటర్వూస్, ఇటు ఛానల్స్ ఇంటర్వ్యూలో బిజీగా గడుపుతున్నాడు. ఎప్పటినుండో అనిల్ రావిపూడి - బాలకృష్ణ కాంబో సినిమాపై రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అనిల్ రావిపూడి తో బాలయ్య మూవీ కన్ఫర్మ్. అయితే ఆ సినిమా మల్టీస్టారర్ గా ఉండబోతుంది అని.. అందులో బాలకృష్ణ ఆయన అన్న కొడుకు కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తారంటూ వార్తలొస్తున్నాయి. ఆ వార్తలపై అనిల్ రావిపూడి తాజాగా స్పందించాడు. బాలకృష్ణ తో చెయ్యబోయే మూవీ ఎలాంటి మల్టి స్టారర్ కాదని, ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తయ్యింది అని, అందులో మరో హీరో ఉండడు అని, బాలయ్యతో తాను చెయ్యబోయే సినిమా పూర్తి డిఫరెంట్ జోనర్ లో ఉండబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. దానితో బాలయ్య - అనిల్ కాంబో మూవీ మల్టీస్టారర్ అన్న న్యూస్ కి చెక్ పడినట్లే అయ్యింది.

Anil Ravipudi confirms extravagant projects:

Balakrishna film with Anil Ravipudi confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs