Advertisement
Google Ads BL

హ్యాపీ గా ఉన్నా.. పెళ్ళిచేసుకుని చెడగొట్టుకోలేను


సీనియర్ లిస్ట్ లోకి వెళ్లిన హీరోయిన్స్ చాలామంది ఈ లాక్ డౌన్ సమయంలో పెళ్లిళ్లు చేసుకుని అటు సినిమాలు, ఇటు కెరీర్ తో బాగా బిజీ అవుతున్నారు. గత ఏడాది కాజల్ అగర్వాల్ అలానే లాక్ డౌన్ లోనే పెళ్లి చేసుకుని ఒక ఇంటిదైంది. ఇక ఈ ఏడాది హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పెళ్లి పీటలెక్కబోతుంది. తాజాగా లక్ష్మి రాయ్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి రెడీ అయ్యింది. ఇక సీనియర్ లిస్ట్ లో ఉన్న అనుష్క పెళ్లి మాటలు ఈ మధ్యనే రేజ్ అయ్యింది. సింగపూర్ కి చెందిన బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్లంటూ వార్తలొస్తున్నాయి. ఇక త్రిష కి ఎప్పుడో ఎంగేజ్మెంట్ అయినా పెళ్లి మాత్రం చేసుకోవడంలేదు. 

Advertisement
CJ Advs

ఇవన్నీ ఇలా ఉంటే నటి కం ప్రొడ్యూసర్ ఛార్మి కూడా ఈ లాక్ డౌన్ లోనే పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక పూరి కాంపౌండ్ లో చేరి పూరి కనెక్ట్స్ పేరుతొ పూరి తో కలిసి ఛార్మి కూడా సినిమాలు నిర్మిస్తుంది. ప్రస్తుతం పూరి, ఛార్మి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ల కాంబోలో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ఛార్మి పెళ్లిపై వస్తున్న వార్తలపై ఛార్మి స్పందించింది.

తాను కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఉన్నతస్థాయిలో ఉన్నాను అని.. అలాగే తన పర్సనల్ లైఫ్ లో కూడా  ఎంతో సంతోషంగా ఉన్నాను అని.. పెళ్లి చేసుకుని.. వివాహబంధంలోకి అడుగుపెట్టి ఈ జీవితంలో తప్పు చేయాలనుకోవడం లేదు అంటూ ట్వీట్ చేసి షాకిచ్చింది. అంటే పెళ్లి చేసుకుంటే తప్పు చేసినట్టా? ఛార్మి ఏ ఉద్దేశ్యంతో అలా అందో ఎవరికి అంతుబట్టడం లేదు.

Charmee rubbishes her marriage rumours:

Charmme Kaur rubbishes wedding rumours, says she will never get married in life
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs