Advertisement
Google Ads BL

సాయి పల్లవి విశ్వరూపం


నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తన సహజ సిద్దమైన నటనతో ప్రేక్షకుల మనసులు దోచేస్తుంది. స్టార్ హీరోల సినిమాలు లేకపోతేనేమి, రాకపోతేనేమి సాయి పల్లవి మీడియం స్టార్ హీరో అవకాశాలతో, చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ. సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాలు షూటింగ్స్ పూర్తి చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అసలైతే లవ్ స్టోరీ ఏప్రిల్ 16 న, విరాటపర్వం ఏప్రిల్ 30 న రిలీజ్ కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వెవ్ తో రెండు సినిమాల రిలీజ్ లు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక సాయి పల్లవి ప్రస్తుతం నాని సరసన శ్యామ్ సింగరాయ్ మూవీలో నటిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన కాళీమాత సెట్ లో చిత్రీకరణ చేసుకుంటుంది. ఈ సెట్ విలువ 6.5 కోట్లు. శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ తోనే అందరిని ఇంప్రెస్స్ చేసి నేచురల్ స్టార్ నాని.. సినిమాపై అంచనాలు పెంచేసాడు. 

Advertisement
CJ Advs

ఇక సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా శ్యామ్ సింగరాయ్ మూవీ నుండి సాయి పల్లవి ఫస్ట్ లుక్ ని వదిలింది టీం. కాళీ మాతగా ఎరుపు రంగు చీరలో.. చేతిలో త్రిశూలంతో సాయి పల్లవి బెంగాలీ గర్ల్ గా విశ్వరూపం చూపిస్తుంది. ట్రెడిషనల్ గా లంగా ఓణీ, చుడిదార్స్, సారీ లో కనిపించే సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ లో కాళీమాత అమ్మవారిగా కొత్తగా కనిపిస్తుంది. ఎప్పుడూ అల్లరిగా కనిపించే సాయి పల్లవి ఈ శ్యామ్ సింగరాయ్ లుక్ లో ఆగ్రహం కన్నా చల్లని చూపు కనిపిస్తుంది. మరి ఈ సినిమాలో సాయి పల్లవి ఏ కేరెక్టర్ లో కనిపిస్తుందో కానీ.. ప్రస్తుతం కాళీ మాత సెట్ కి తగ్గట్టుగా బెంగాలీ అమ్మాయిగా సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ లుక్ ఉంది. లవ్ స్టోరీలో లంగా ఓణీతో మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి విరాట పర్వంలో డీ గ్లామర్ గా కనిపించబోతుంది. ఇక ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న సాయి పల్లవికి సినీ జోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Sai Pallavi first look from Shyam Singha Roy Movie:

Shyam Singha Roy: Sai Pallavi looks majestic in Bengali look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs