నిర్మాతల అవసరం.. ఓటిటీల బెట్టు


గత ఏడాది తొమ్మిదినెలలు కరోనా వలన కేలెండర్ లెక్కల్లోకి లేకుండా పోయాయి. ఈ ఏడాది ఎన్ని నెలలు కరోనాకి అప్పగించాల్సి వస్తుందో అర్ధమే కావడం లేదు. ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న వేళ అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్స్, నైట్ కర్ఫ్యూలు అంటూ థియేటర్స్, క్రీడా వేదికలు, రెస్టారెంట్స్, బార్లు అన్ని క్లోజ్ అవుతున్నాయి. ఇక గత ఏడాదిలాగే థియేటర్స్ మూత బడడంతో చాలా సినిమాలు ఓటిటి బాట పట్టాయి. అప్పట్లో ఓటిటి వాళ్ళు కూడా నిర్మాతల వెంటబడి సినిమాలు కొనేసాయి. ఓటిటిలో రిలీజ్ చేసేశాయి. అప్పట్లో బెట్టు చేసిన నిర్మాతలకి ఇప్పుడు మరోసారి థియేటర్స్ మూతబడడంతో ఓటిటి తప్ప వేరే దిక్కు కనిపించడం లేదు.

దానితో కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను ఓటిటీలకి అమ్మాలన్నా.. ఈసారి ఓటిటి సంస్థలు బెట్టు చేస్తున్నాయి. థియేటర్స్ మూత పడ్డాయి వారికి వేరే ఛాన్స్ లేదు.. మాకే ఇవ్వాలి. కాబట్టి రేట్లు తగ్గించేసి అడుగుతున్నారట. దానితో అటు అప్పుల భారం మొయ్యలేక, ఇటు ఓటిటీలు చెప్పిన రేట్లకి అమ్మలేక సతమతమవుతున్నారు. థియేటర్స్ క్లోజ్ అయినా ఇంతవరకు చిన్న సినిమాలు కూడా ఓటిటిలో రిలీజ్ ఆడానికి రెడీ అవడం లేదు.

జస్ట్ ఆహా లో థాంక్యూ బ్రదర్ తప్ప మరో సినిమా ఇంతవరకు ఓటిటికి వచ్చింది లేదు. ఆహా లో థాంక్యూ బ్రదర్ మూవీ కూడా ఓ డీల్ మీద విడుదలైనట్టుగా తెలుస్తుంది. ఆహా లాంటి ప్లాటుఫార్మ్స్ లో సినిమాలు రిలీజ్ చేయటం ఓ సాహసంలానే వుంది. క్వాలిటీ టీం అంటూ.. ఆహా వారి దగ్గరకు వచ్చిన సినిమాలను నాణ్యత లేదు అంటూ.. సినిమాలను కిల్ చేయటం, తక్కువ చేసి మాట్లాడి సినిమాలను తక్కువ రేటుకు అడగటంతో.. వచ్చిన వారికి వేరే అవకాశం లేక అక్కడే లాక్ అయ్యి దిక్కుతోసని పరిస్థితులలో రీచ్ లేక పోయినా  OTT లకు ఇవ్వ వలసి వస్తుంది. కరోనా త్వరగా పోయి, ఈ ఆగడాలకు అడ్డు కట్ట పడి మామూలు పరిస్థితి రావాలని అందరూ కోరుకుంటున్నారు.

Producers need, OTTs not minding:

<span>OTTs squeezing producers</span>
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES