బాలకృష్ణ - బోయపాటి కాంబో లో BB3 గా తెరకెక్కుతున్న అఖండ మూవీ టీజర్ యూట్యూబ్ రికార్డుల వేటలో వుంది. నందమూరి నటసింహం బాలయ్య బాబు - మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబో అంటే బ్లాక్ బస్టర్ హిట్ పక్కా. కానీ అఖండ టీజర్ చూసాక ఈసారి రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. సెకండ్ వేవ్ లోనూ అఖండ షూటింగ్ ని పూర్తి చేస్తున్నారంటే బాలయ్య - బోయపాటి మామూలోళ్లు కాదు. అఖండ టీం షూటింగ్ విషయంలో కరోనాని లెక్క చెయ్యకపోయినా, రిలీజ్ విషయం మాత్రం కరోనాకి భయపడాల్సిందే. మే 28 న ఎన్టీఆర్ జయంతి రోజున అఖండ మూవీ కి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. కానీ కరోనా తో థియేటర్స్ మూతబడడంతో ఇప్పుడు అఖండ రిలీజ్ పోస్ట్ పోన్ ఖాయంగా కనిపిస్తుంది.
అఖండ రిలీజ్ డేట్ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే మళ్ళీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం అఖండ రిలీజ్ డేట్ కి అఖండ నుండి ఓ స్పెషల్ ట్రీట్ రాబోతుంది. అంటే అఖండని మే 28 న రిలీజ్ చేయలేకపోయినా.. అదే టైం కి అఖండ నుండి ఫస్ట్ సింగిల్ ని వదలబోతున్నారట. మరి నందమూరి ఫాన్స్ కి అఖండ చూసే అదృష్టం మిస్ అయినా.. ఫస్ట్ సింగిల్ తో సరిపెట్టుకోవాల్సిందే. అఖండ మూవీలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్ గానూ, పూర్ణ సెకండ్ హీరోయిన్ గాను నటిస్తున్న విషయం తెలిసిందే.