Advertisement
Google Ads BL

కంగనాకి కరోనా


దేశం మొత్తం కరొనతో అల్లాడుతుంటే.. కంగనా రనౌత్ మాత్రం రాజకీయనాయకులపై సెటైర్స్ వేస్తుంది. బెంగాల్ లో మమతా ప్రభుత్వం వచ్చాక అక్కడ అల్లర్లలో బిజెపి నేతలపై దాడులు జరగడంతో కంగనా రనౌత్ మమతా బెనర్జీ పై ఘాటు వ్యాఖ్యలు చేసి ట్విట్టర్ లో షేర్ చెయ్యగా.. ట్విట్టర్ ఆమెని శాశ్వతంగా నిషేదించింది. ఇక బెంగాల్ అల్లర్లపై కంగనా కామెంట్స్ మతఘర్షణలకు దారితీసేవిలా ఉన్నాయని ఆమెపై కేసు నమోదైంది. నేను కేసులకు భయపడను, ట్విట్టర్ నిషేదిస్తే నా నోరు మూతబడదు అన్న కంగనా కరోనాకి దొరికిపోయింది.

Advertisement
CJ Advs

కంగనాకు కరోనా వినడానికి రైమింగ్ వర్డ్ లా ఉన్నా.. ప్రస్తుతం కంగనాకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆమె ఈ విషయాన్నీ సాంఘీక మాధ్యమాల ద్వారా పంచుకుంది. కొన్ని రోజుల నుండి కళ్ళు మంటలు, కాస్త నీరసంగా ఉండడంతో.. కరోనా టెస్ట్ చేయించుకోగా.. తనకి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. శనివారం ఉదయం ఇన్‌స్టా వేదికగా కంగనా తనకి పాజిటివ్ వచ్చిన విషయంతో పాటుగా, ధ్యానం చేస్తోన్న ఓ ఫొటోని షేర్‌ చేసింది. తాను ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నట్లుగా చెప్పిన కంగనా ధైర్యంగా వైరస్ తో పోరాడండి, అందరూ మనో బలంతో, ధైర్యంతో ఉండండి.. మీ బలాన్ని మీరు వేరొకరి చేతిలో పెట్టకండి.. కరోనా వైరస్ తో పోరాటం చెయ్యండి.. ప్రస్తుతం తానూ అదే చేస్తున్నట్టుగా కంగనా తన పోస్ట్ లో తెలిపింది.

Kangana Ranaut Tests Positive for Covid 19:

Kangana Ranaut tests positive for Covid-19, writes it is nothing but a small time flu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs