Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఫాన్స్ కి మూడు సర్ప్రైజ్ లు


గత ఏడాది ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకి కరోనా బ్రేకులు వేసింది. ఎన్టీఆర్ కూడా ఫాన్స్ ని ఎలాంటి హంగామా చెయ్యొద్దు.. సేఫ్ గా ఇంట్లోనే ఉండమనేసరికి ఫాన్స్ సైలెంట్ అయ్యారు. అలాగే రాజమౌళి కూడా రామ్ చరణ్ కి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినా ఎన్టీఆర్ బిర్ట్ డే కి ఫాన్స్ ని సర్ప్రైజ్ చేయలేకపోయారు. కానీ షూట్ మొదలు పెట్టగానే ఎన్టీఆర్ ఫాన్స్ కి కొమరం భీం వీడియో తో అదిరిపోతే గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ బర్త్ డే టైం కి కరోనా ఉధృతి మాములుగా లేదు. ఇలాంటి సిట్యువేషన్ లో మరోసారి ఫాన్స్ ని రాజమౌళి డిస్పాయింట్ చేస్తాడేమో అనుకుంటుంటే.. లేదు ఎన్టీఆర్ బర్త్ డే పోస్టర్ ఎప్పుడో రెడీ అయ్యింది.. దానితోపాటు టీజర్ రిలీజ్ కూడా ఉండబోతుంది అనే న్యూస్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ఆగడం లేదు.

Advertisement
CJ Advs

మరోపక్క NTR30 నుండి కూడా ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్ ని కొరటాల శివ రెడీ చేస్తున్నాడనే న్యూస్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. అంటే కొరటాల - ఎన్టీఆర్ కాంబో NTR30 నుండి టైటిల్ అనౌన్సమెంట్ కానీ, లేదంటే కాన్సెప్ట్ పోస్టర్ కానీ ఉండొచ్చనే ఊహాగానాలు మొదలలయి. ఈ రెండు ఓకె. ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ కి మరో సర్ప్రైజ్ కూడా ఉండబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఇంతవరకు అనౌన్సమెంట్ లేని ప్రశాంత్ నీల్ నుండి మైత్రి మూవీ మేకర్స్ NTR31 పై బిగ్ అనౌన్సమెంట్ ఇప్పించబోతుంది అనే న్యూస్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందానికి అవధులు అడ్డుకట్ట లేకుండా పోయింది. 

ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబో ఫిక్స్ అయినప్పటికీ అనౌన్సమెంట్ లేకుండా సస్పెన్స్ లో పెట్టిన మైత్రి వారు ఈసారి ఆ సస్పెన్స్ కి తెరదించబోతున్నారట. సో ఈ లెక్కన ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఫాన్స్ కి మూడు ట్రీట్ లు వచ్చినట్టే. ఇది పక్కా అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ఓ పోస్టర్ ని రెడీ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

NTR Special Surprise To Fans On His Birthday:

3 Updates for NTR Birthday 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs