Advertisement
Google Ads BL

కంగనాపై కేసు నమోదు


కంగనా రనౌత్ ముక్కు సూటిగా మాట్లాడే మనిషి. అది ఎవరూ కాదనలేని నిజం. కాకపోతే రాజకీయాల విషయంలో బీజీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ మిగతా పార్టీలని దుయ్యబట్టే కంగనా పై ఈ మధ్యన ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించింది. అయినా కంగనా ఏమాత్రం తగ్గలేదు. ట్విట్టర్ అమెరికాది. ట్విట్టర్ నిషేధిస్తే.. నాకు మాట్లాడడానికి మరిన్ని మార్గాలున్నాయి.. నా సినిమాల ద్వారా నోరు విప్పుతా అంటూ రెచ్చిపోయింది. బెంగాల్ అల్లర్లపై, మమతా బెనర్జీ ప్రభుత్వంపై కంగనా చేసిన వ్యాఖ్యల ఫలితం ఆమెకి ట్విట్టర్ షాకిచ్చింది.

Advertisement
CJ Advs

ఇప్పుడు ట్విట్టర్ మాత్రమే కాదు.. కంగనాపై కేసు కూడా నమోదైంది. మమతా బెనర్జీ పై తీవ్ర వ్యాఖ్యలు, బెంగాల్ అల్లర్లపై ఆమె చేసిన కామెంట్స్ వలన.. మత ఘర్షణలు చెలరేగేలా ఉన్నాయంటూ కంగనాపై కేసు నమోదయ్యింది. అయినా కంగనా తగ్గడం లేదు. నన్ను కేసులతో భయపెట్టలేరంటూ విరుచుకుపడింది. గతంలోనూ మహారాష్ట్రలో శివ సేన ప్రభుత్వంతో నువ్వా - నేనా అంటూ తిరగబడిన కంగనా ఇప్పుడు మమతా బెనర్జీ పై చేసిన వ్యాఖ్యల విషయంలోనూ పంతానికి పోతూ తనని కేసులు భయపెట్టలేవంటుంది.

Case registered against Kangana:

Kolkata Police register case against Kangana Ranaut after TMC complaint, actress reacts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs