Advertisement
Google Ads BL

అనసూయకి అచ్చిరావడం లేదు


అనసూయ బుల్లితెర మీద గ్లామర్ ని పరిచయం చేసిన భామ. వయసుతో సంబంధం లేకుండా గ్లామర్ చూపించొచ్చు అనేది అనసూయని చూస్తే అర్ధమవుతుంది. బుల్లితెర హాట్ యాంకర్ గా నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న అనసూయ వెండితెర మీద స్పెషల్ సాంగ్స్ తోనూ, స్పెషల్ కేరెక్టర్స్ తోనూ అదరగోటేటిస్తుంది. అనసూయ వరకు ఓకె. కానీ అనసూయ చేసిన స్పెషల్ సాంగ్స్ కానీ, కథా బలమని నమ్మి చేస్తున్న సినిమాలు కాని అనసూయకి అచ్చిరావడం లేదనే చెప్పాలి. అంటే అడవి శేష్ తో కలిసి క్షణం చేసిన అనసూయకి ఆ సినిమా పేరు అయితే తెచ్చింది కానీ.. డబ్బు తేలేదు. అలాగే సోగ్గాడే చిన్న నాయన సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన అనసూయకి సుకుమార్ రంగస్థలంలో రంగమ్మత్తగా మంచి పేరొచ్చింది.

Advertisement
CJ Advs

ఇక కథనం అంటూ అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కూడా ఫట్. అంతేకాదు.. రీసెంట్ గా అనసూయ మెయిన్ లీడ్ లో తెరకెక్కి థియేటర్స్ మూత బడడంతో ఓటిటి నుండి రిలీజ్ అయిన థాంక్యూ బ్రదర్ కూడా అనసూయ ప్లాప్ లిస్ట్ చేరిపోయినట్టే కనిపిస్తుంది. క్రిటిక్స్ మొత్తం థాంక్యూ బ్రదర్ ని కాస్తా సారి బ్రదర్ అనేసారు. అంటే సినిమాలో విషయం లేదని డైరెక్ట్ గానే తేల్చేసారు. ప్రియా గా అనసూయ ఫుల్ ఎఫర్ట్ పెట్టిన చేసిన ఈ సినిమా సో సో గానే మిగిలిపోయింది. అనసూయ కథా బలం, మెయిన్ లీడ్ నేనె అని అనుకుని చేసిన సినిమాలన్ని వరసబెట్టి అనసూయ షాకిస్తూనే ఉన్నాయి.

పాట బావుంది, లిరిక్స్ బావున్నాయని స్పెషల్ సాంగ్స్ లో కాలు కదిపిన అనసూయకి అక్కడా షాకు తగులుతుంది కానీ అచ్చిరావడం లేదు. అనసూయ ఐటెం సాంగ్స్ చేసిన రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. సాయి ధరమ్ తేజ్ విన్నర్, కార్తికేయ చావు కబురు చల్లగా రెండూ రెండే. మరి అనసూయ స్టార్ హీరోల సినిమాలో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవడమే బెటర్. లేదంటే ఇలాంటి షాకులే తినాల్సి వస్తుంది అంటున్నారు ఫాన్స్. ప్రస్తుతం అనసూయ ఖిలాడీ, పుష్ప మూవీస్ లో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

No luck for Anasuya:

Not so good reviews for thank you brother
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs