ఇండియా వైడ్ గా చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూలు పెడుతున్నారు.. కానీ లాక్ డౌన్ ఊసెత్తడం లేదు. అందులో రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. కరోనా కర్ఫ్యూ అంటున్నారు కానీ లాక్ డౌన్ పెట్టడానికి ఇష్టపడడం లేదు. ప్రజలు లాక్ డౌన్ తో నష్ట పోతున్నారు అది నిజం. కానీ లాక్ డౌన్ పెట్టకపోవడం వలన చాలామంది కరోనా తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో నాలుగు లక్షల పైమాటే కరోనా కేసులు నమోదు అవుతుంటే.. వేలల్లో ప్రాణాలు పోతున్నాయి. ఇలానే ఉంటే ఇండియా సెకండ్ వేవ్ నుండి థర్డ్ వెవ్ లోకి వెళ్ళిపోతుంది అని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌసీ చెబుతున్నారు.
ఇండియాలో కరోనా తో పరిస్థితి చెయ్యి దాటకముందే కరోనా కట్టడి కి చర్యలు తీసుకోవాలని.. దేశం మొత్తం మూడు నుండి నాలుగు వారాలపాటు అంటే ఒక నెల రోజులు ఖచ్చితంగా లాక్ డౌన్ పెడితేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది అని.. లాక్ డౌన్ పెడితే దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుంది అనే ఆందోళనకి పక్కనబెట్టమని ఫౌసీ హితవు పలుకుతున్నారు. అలాగే అందరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తేవాలని, తాత్కాలికంగా కోవిడ్ హాస్పిటల్, బెడ్స్ సిద్ధం చెయ్యాలని, కరోనా నియంత్రణకు ఉన్న అన్ని మార్గాలను వాడుకోవాలని, వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలని చెప్పిన ఆయన.. అన్నిటికి ఒకటే సొల్యూషన్.. ఒక నెల లాక్ డౌన్ అంటూ విపత్కర పరిస్తితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఇండియా పై స్పందించారు.