బాలకృష్ణ - బోయపాటి అఖండ మూవీ షూటింగ్ కి కరోనా కారణంగా ఎలాంటి డిస్టబెన్స్ లేదు. యూనిట్ మొత్తం సేఫ్ జోన్ లో ఉండి అఖండ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నా.. ప్రస్తుతం అయితే మే 28 న అఖండ మూవీ రిలీజ్ అవడం కుదరదు. ఎందుకంటే అఖండ మూవీ రిలీజ్ చెయ్యడానికి థియేటర్స్ ఓపెన్ అవ్వాలిగా. అఖండ టీం ఎంతగా పోరాడినా సినిమాని రిలీజ్ చెయ్యడం కుదరదు. అఖండ మూవీ పోస్ట్ పోన్ చేసిన మేటర్ అధికారికంగా రాకపోయినా అదే ఫిక్స్. ఇక అఖండ మూవీ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటెర్టైనెర్ చెయ్యబోతున్నాడు.
ఆ సినిమాలో బాలకృష్ణ కోసం గోపీచంద్ ఇద్దరు హీరోయిన్స్ కి ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. అందులో ఒకటి కోలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ అయితే మరొకరు సీనియర్ హీరోయిన్ మీనా అంటున్నారు. బాలకృష్ణ సినిమాలో శృతి నటిస్తుందా అన్న ప్రశ్నకి తనకి క్రాక్ తో పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ అడిగితే శృతి హాసన్ కాదనదు అనే నమ్మకం బాలయ్య ఫాన్స్ లో కలుగుతుంది. ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ కి జోడిగా మీనా ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. గోపీచంద్ కూడా బాలయ్య రెండు కేరెక్టర్స్ లో చూపించబోతున్నాడట. ఆ రెండు కేరెక్టర్ లో బాలయ్య ఫ్యాక్షనిస్టు, పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సినిమాకి ఇద్దరు హీరోయిన్స్ ఆవరసరమవుతున్నారట.
ఇక మీనా-బాలయ్య కాంబో అనగానే వారు గతంలో నటించిన హిట్స్ గుర్తుకు రాగా.. ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవడం ఖాయం. ఇప్పటికే గోపీచంద్ మీనా ని సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తుంది.