Advertisement
Google Ads BL

పుకార్లు పుట్టించొద్దు : పుష్ప టీమ్


పుష్ప సినిమా కెజిఎఫ్, బాహుబలి మాదిరి రెండు పార్ట్ లుగా రిలీజ్ చెయ్యబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా గుప్పుమంది. బాహుబలి కథానుసారం.. ఒక భాగం లో చూపించలేక రాజమౌళి బాహుబలి 1, బాహుబలి 2 అంటూ రెండు పార్ట్ లుగా సినిమాని చూపించారు. ఇక ప్రశాంత్ నీల్ కూడా కెజిఎఫ్ ని అలానే రెండు భాగాలుగా చూపించబోతున్నారు. ఇప్పుడు కూడా అల్లు అర్జున్ - సుకుమార్ కూర్చుని మాట్లాడుకుని.. పుష్ప సినిమా ని రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని.. పుష్ప కథ ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది చిన్న కథా కాదు, చిన్న విషయము కాదు.. కాబట్టి ఒక పార్ట్ లో కథ చెప్పడం కుదరదని పుష్ప టీం భావించి రెండు పార్టులుగా పుష్ప సినిమాని రెడీ చేస్తున్నారంటూ ఏవేవో కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

Advertisement
CJ Advs

అయితే ఇదే విషయం మీద పుష్ప టీం ని కదపగా.. అవన్నీ జస్ట్ రూమర్స్.. పుష్ప రెండు పార్ట్ లు గా తెరక్కెడం లేదు.. అలాంటప్పుడు రెండు పార్ట్ లుగా ఎలా రిలీజ్ చేస్తామంటూ పుష్ప పై వస్తున్న రూమర్స్ ని కొట్టిపడేసారు. దానితో పుష్ప సినిమా రెండు పార్టులు కాదు.. ఒకటే పార్ట్ గా ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనేది స్పష్టత వచ్చేసింది. మరి కరోనా సెకండ్ వేవ్ తో ఆగిన సినిమా షూటింగ్ మళ్లీ అనుకున్న టైం కి మొదలైతే.. అనుకున్న డేట్ కి పుష్ప వచ్చేస్తుంది. సుకుమార్ - అల్లు అర్జున్ అయితే అదే ప్లాన్ లో ఉన్నారు కానీ కరోనా కరుణించాలిగా.

Pushpa team says don't spread false rumors:

There is no sequel planned for Pushpa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs