Advertisement
Google Ads BL

సిద్దార్ధ్-విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ వార్


కొన్నాళ్లుగా ఎవరికీ కనబడని సిద్దార్థ్ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్న టైం లో సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యాడు. కరోనా కట్టడి విషయంలో బిజెపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై సిద్దార్థ్ ట్వీట్స్ వర్షం కురిపిస్తున్నాడు. దానితో బిజెపి నేతలు సిద్దర్ద్ ని టార్గెట్ చేసి.. ఎదురు దాడి చేస్తున్నారు. తన ఫోన్ నెంబర్ బిజెపి నేతలు లీక్ చెయ్యడంతో తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడిన సిద్దార్ధ్.. కేంద్ర ప్రభుత్వం, బిజెపి ప్రభుత్వం పై విమర్శల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అయితే హీరో గా సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న సిద్దార్ధ్ తన ఉనికిని కాపాడుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు అంటూ బిజెపి నేతలూ ఊరుకోవడం లేదు.

Advertisement
CJ Advs

రీసెంట్ గా సిద్దార్ద్ బెంగాల్ లో మమతా బెనర్జీకి మద్దతునివ్వడంతో.. బిజెపి నేతలు మరోసారి రెచ్చిపోయారు. బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి సిద్దార్ధ్ పై ట్వీట్స్  తో రెచ్చిపోయాడు. ఈయన సినిమాలన్నీ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఇచ్చే డబ్బుతో నిర్మించబడుతున్నాయి అటూ ట్విట్టర్ లో సిద్దార్ధ్ ని టాగ్ చెయ్యడంతో.. హీరో సిద్దార్ద్ కూడా ధీటుగా సమాధానం చెప్పాడు. తన పన్నులు చెల్లించడానికి దావూద్ ఇబ్రహీం సిద్ధంగా లేడని.. తాను కట్టాల్సిన టాక్స్ తానే చెల్లిస్తూ వస్తున్నానని ట్వీట్ చేసిన సిద్దార్ధ్.. నువ్వు బిజెపి రాష్ట్ర సెక్రటరీ అట కదరా, సిగ్గుండాలి, వెళ్లి పడుకో అంటూ ఘాటుగా విష్ణు వర్ధన్ రెడ్డి కి రిప్లై ఇచ్చాడు

Siddharth vs Vishnu Vardhan reddy:

Siddharth sensational reply on BJP leader Vishnu Vardhan Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs